అన్వేషించండి

River Boards: తెలంగాణకే కాదు ఏపీకి కూడా "గెజిట్"పై అభ్యంతరాలు.. నదీ బోర్డుల వివాదంలో సరికొత్త ట్విస్ట్..!

ప్రాజెక్టుల్ని కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని అదే పనిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ఇప్పుడు తీసుకున్న తర్వాత అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులపై రెండు తెలుగు ప్రభుత్వాలకూ అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. గెజిట్ విషయంలో తమతో సంప్రదించకపోవడం దగ్గర్నుంచి అన్ని ప్రాజెక్టులనూ.. బోర్డులకు కిందకు తేవడంపై నిరసన వ్యక్తం చేస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి కూడా వారు హాజరు కాలేదు. కాబట్టి వారి విషయంలో క్లారిటీ ఉంది. అనూహ్యంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గెజిట్ అమలుకు సహకరించేందుకు సిద్ధంగా లేదు. 

కృష్ణా, గోదావరి బోర్డులపై గెజిట్ విడుదల చేయాలంటూ అదే పనిగా కేంద్రానికి లేఖలు రాసి సాధించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. గెజిట్ అమలుకు సహకరించాలని... హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారులు కోరారు. కానీ ఏపీ అధికారులు మాత్రం తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో వారి అభిప్రాయం నమోదు కాలేదు. కానీ ఏపీ అధికారులు హాజరై..  బెర్డు గెజిట్‌లపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని.. అమలుకు సహకరించబోమని చెప్పేశారు. ఏం అభ్యంతరాలో చెప్పమంటే.. తాము ఇక్కడ చెప్పబోమని..నేరుగా కేంద్రానికే చెబుతామని చెప్పి.. వచ్చేశారు. 

ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్ర అధికారులు విస్మయానికి గురయ్యారని జలవనరుల నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ప్రాజెక్టులను ఏపీనే .. కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని మొదట కోరింది. రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కృష్ణా జలాల వివాదంలో వివాదాలకు దిగాయి.  సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిలిపివేయాలని ఎన్జీటీ, కేఆర్ఎంబీ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఆరోపిస్తూ.. తెలంగాణ సర్కార్.. డెడ్ స్టోరేజీ వరకూ అన్ని ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయాలని జీవో జారీ చేసింది. ఆ మేరకు ఉత్పత్తి కూడా చేశారు. ఆ సమయంలో ఏపీ సీఎం జగన్.. ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకోవాలని లేఖలు రాశారు. చివరికి ప్రాజెక్టుల్ని కేంద్ర అధీనంలోకి తీసుకుని బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ... గెజిట్ జారీ చేశారు. 

అయితే ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి... ప్రతీ చిన్న ప్రాజెక్టును చేర్చారు. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతలను చేర్చలేదు. అంటే.. అసలు అ ప్రాజెక్టును గుర్తించలేదన్న మాట. ఈ ప్రాజెక్టుల పరిధిని డిసైడ్ చేస్తూ విడుదల చేసిన గెజిట‌్‌ను అమలు చేస్తే ... ఏపీ తీవ్రంగా నష్టపోతుందని... జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా మనసు మార్చుకున్నట్లుగా చెబుతోంది. అన్ని ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి తేవడం వద్దని... కేవలం వివాదం ఉన్న ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధఇలోకి తీసుకుంటే చాలన్నట్లుగా  వాదిస్తోంది. ఇదే అంశాన్ని కేంద్రానికి చెప్పాలని అనుకుంటోంది. అందుకే గెజిట్ అమలుకు సహకరించేందుకు ఏపీ సర్కార్ కూడా వెనుకడుగు వేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget