Breaking News: రేవంత్ చిలక మనదే.. పలుకు పరాయిది.. మంత్రి కేటీఆర్ ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
కర్నూలు జిల్లా అల్లూరు సబ్ రిజిస్టర్ శ్రీనివాసులును స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్ సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం అల్లూరు రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. లెక్కల్లో చూపిన రూ.75 వేల నగదు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై విచారించిన డీఐజీ కిరణ్ కుమార్, సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు సస్పెండ్ చేశారు.
తెలంగాణలో కొత్తగా 339 కోవిడ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 80,568 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ మేరకు వెల్లడైంది. గత 24 గంటల వ్యవధిలో ఇద్దరు కోవిడ్ కారణంగా మరణించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 3,867కి చేరింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నిన్న ఒక్క రోజే 417 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 6.46 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌కు అదనపు బాధ్యతలు..
తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌కు పంజాబ్, ఛండీగర్ రాష్ట్రాల గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు.
President Ram Nath Kovind appoints Banwarilal Purohit, Governor of Tamil Nadu to discharge the functions of Governor of Punjab, in addition to his own duties from the date he assumes charge of the office of the Governor of Punjab, until regular arrangements are made.
— ANI (@ANI) August 27, 2021
(File pic) pic.twitter.com/L7fZLCNSaG
విశాఖలో విషాదం.. కుమార్తె వివాహ సమయంలో తల్లిదండ్రుల బలవన్మరణం
కుమార్తె వివాహం ప్రారంభమైంది. మరికాసేపట్లో కన్యాదానం చేయాల్సి ఉంది. వధువు తల్లిదండ్రులు ఫంక్షన్‌హాల్ లో ఎక్కడా కనిపించట్లేదు. అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా.. విగత జీవులై పడి ఉన్నారు. మద్దిలపాలెంలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పోర్టు విశ్రాంత ఉద్యోగి జగన్నాథరావు (63), ఆయన భార్య విజయలక్ష్మి (57) తమ కుమార్తె వివాహం చేయాలని నిశ్చయించారు. వివాహ తంతు ప్రారంభమైంది. మరికాసేపట్లో కూతురికి కన్యాదానం చేయాల్సి ఉంది. వధువు తల్లిదండ్రుల కోసం బంధువులు ఫంక్షన్ హాల్ మొత్తం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. గదిలో విగతజీవులై కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
మానసిక సమస్యలే కారణమా?
పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కారణంగానే విజయలక్ష్మి తరచూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేదని... కుమార్తె పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడిందని బంధువులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు.. ఆమెను చంపి, తాను కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
రేవంత్ చిలక మనదే.. పలుకు పరాయిది: కేటీఆర్
‘‘రేవంత్ రెడ్డి స్థాయేంటో అందరికీ తెలుసు. ఆయన ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. ఆ చిలక మనదే.. పలుకు పరాయిది. ఆయన వెనక ఉన్నదెవరో.. మాట్లాడించేది ఎవరో..నాకే కాదు.. అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఫ్రాంఛైజీ లాగా తీసేసుకున్నాడు. రేవంత్‌ను బొమ్మ లెక్క నడిపిస్తుండు. చంద్రబాబు ఆడించే తోలుబొమ్మలాటలో ఒక బొమ్మ అంతే. ఈ గజ్వేల్ సభ అంతా లొల్లి ఎందుకు? మంత్రి మల్లన్న చెప్పినట్లు రాజీనామా చెయ్ సూద్దం. అడనే చూస్కుందం.’’ అని కేటీఆర్ అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పిటిషన్లపై విచారణ వాయిదా
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 8కి ఎన్జీటీ చెన్నై బెంచ్ వాయిదా వేసింది. నివేదిక అందించేందుకు అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ సమయం కోరడం వల్ల విచారణను వాయిదా వేసినట్లు ట్రైబ్యునల్ తెలిపింది.