(Source: ECI/ABP News/ABP Majha)
Pinnelli News: పిన్నెల్లికి హైకోర్టు షాక్! ఆ రోజుదాకా మాచర్లలోకి నో ఎంట్రీ, ఆంక్షలతో ఉత్తర్వులు విడుదల
AP Latest News: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అస్సలు మాచర్లలో అడుగు పెట్టకూడదని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పార్లమెంట్ నరసాపురంలోనే వచ్చే నెల 6 వరకు ఉండాలని ధర్మాసనం ఆదేశించింది.
AP High Court on Pinnelli Ramakrishna Reddy: మాచర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి నిన్న ఊరట కలిగించిన ఏపీ హైకోర్టు నేడు (మే 24) కాస్త చేదు వార్త వినిపించింది. పిన్నెల్లి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి అస్సలు మాచర్లలో అడుగు పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం అయిన నరసాపురంలోనే వచ్చే నెల 6 వరకు ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే పిన్నెల్లికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పిన్నెల్లి ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఆఖరికి సాక్షులతో కూడా పిన్నెల్లి మాట్లాడేందుకు వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచాలని ఆదేశించింది.
Also Read: పిన్నెల్లికి హైకోర్టులో రిలీఫ్! ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈసీకి హైకోర్టు కీలక ఆదేశాలు
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్ కావడంతో ఈసీ కఠినంగా స్పందించింది. పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పిన్నెల్లి పరారీలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు టీమ్ లు ఆయన కోసం గాలించాయి. దీంతో పిన్నెల్లిపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి హైదరాబాద్‌లో ఉన్నారని సమాచారం రావడంతో తెలంగాణకు వెళ్లి ఏపీ పోలీసులు గాలించారు. ఇంతలో పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పై పిటిషన్ వేశారు.
Also Read: పిన్నెల్లి అజ్ఞాతం వీడుతారా? కోర్టు ఆదేశాలతో బయటకు వస్తారా?