అన్వేషించండి

అమరావతికి పార్లమెంటు అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు: చంద్రబాబు

Chandrababu Comments: అమరావతి రాజధాని కోసం పార్లమెంటు అండగా నిలుస్తుందని చంద్రాబుబు తెలిపారు. అమరావతి ఏ కులానికో, కొందరికో పరిమితం కాదని.. ఆ సంకల్పం వృథా పోదని స్పష్టం చేశారు.

Chandrababu Comments: ఏపీ రాజధానిగా అమరావతికి  పార్లమెంటు అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పినట్లు టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని తనతో ఓ మాట చెప్పారని అన్నారు. అందేంటంటే... పవిత్రమైన యమునా జలాల్ని, చట్టాలు చేసే పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి తెచ్చానని చెప్పి.. దాని ఉద్దేశం అమరావతికి ఆయన అండగా ఉంటానని చెప్పడమే అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ మాటలు ఇప్పటికీ తన చెవుల్లో వినిపిస్తున్నాయని అన్నారు. ఈ సంకల్పం వృథా పోదని.. అంతిమంగా ధర్మమే గెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. అమరావతి పరిరక్షణకు రైతులు చేస్తున్న పోరాటం కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. 

కావాలనుకుంటే తిరుపతిలోనే రాజధాని పెట్టుకునేవాడిని..

వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా అమరావతి ఏ కులానికో, ఏ కొందరికో పరిమితం కాదని తెలిపారు. అమరావతిని ఐదు కోట్ల మంది ప్రజలకు మేలే చేసే ప్రజారాజధానిగా నిర్మించాలనుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రాంతమో, కులమో చూసుకుంటే.. తిరుపతిలోనే రాజధానిని పెట్టుకునేవాడినని, నారావారి పల్లె నుంచి రంగంపేట, తిరుపతి వరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు.  కానీ తాను శాశ్వతం కాదని, నవ్యాంధ్రకు రాజధాని మాత్రమే శాశ్వతం అని ఆలోచించి.. అమరావతి రాజధానిగా చేయాలనుకున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

జగన్ చెప్పిన దాని కంటే 24 వేల ఎకరాలు ఎక్కువ..

అయితే సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ రచించిన అమరావతి వివాదాలు-వాస్తవాలు అన్న పుస్తకాన్ని గురువారం విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆయన అమరావతి గురించి చాలా విషయాలను తెలిపారు. అమరావతిపై వైసీపీ నాయుకులు, ప్రభుత్వం ప్రజల్లో సృష్టించిన అపోహల్ని కందుల రమేష్ తన పుస్తకంతో తొలగించారని, వాస్తవాలను మాత్రమే పేర్కొన్నారని చెప్పుకొచ్చారు. గుంటూరు విజయవాడ మధ్య 30 వేల ఎకరాల్లో రాజధాని పెడితే తమకు అభ్యంతరం లేదని ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అలాగే రైతులు ఇచ్చింది, ప్రభుత్వ భూమి కలిపి రాజధానికి 54 వేల ఎకరాలు సమీకరించామని.. జగన్ చెప్పినదాని కన్నా 24 వేల ఎకరాలు ఎక్కువ ఉండగా... ఆయనకు అభ్యంతరం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. 

వైఎస్ఆర్ కూడా ప్రారంభించిన పనులు ఆపలేదు..

అమరావతి ఏ ఒక్కరికో పరిమితం కాదని.. అలా అనుకుంటే హైదరాబాద్ ని ఏ కులం కోసం అభివృద్ధి చేశానని అన్నారు. అమరావతిని అంత అభివృద్ధి చేశాక కూడా గత ఎన్నికల్లో ఎస్పీ స్థానమైన తాడికొండలో తెదేపా ఓడిపోయింది. హైదరాబాద్ ని అభివృద్ధి చేశాక... 2004 ఎన్నికల్లో ఖైరతాబాద్ లో ఓడిపోయామని.. కాబట్టి అభివృద్ధికి, ఎన్నికలకు సంబంధం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ హయాంలో కూడా తాను ప్రారంభించిన ఏ ఒక్క అబివృద్ధి పనిని అతను ఆపలేరని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలు కూడా అలా చేయలేవని.. అందుకే హైదరాబాద్ అంతగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అమరావతిని రాజధానిగా, విశాఖను ఆర్థిక రాజధానిగా, తిరుపతిని మరో మహా నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని కేంద్ర విభజన చట్టం ప్రకారం మంజూరు చేసిన సంస్థల్ని రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget