MP Vijayasai Reddy : తిట్టడం మా ఎజెండా కాదు, రెండేళ్లలో ఏం చేస్తామో ప్లీనరీలో చెప్పాం - ఎంపీ విజయసాయి రెడ్డి
MP Vijayasai Reddy : వైసీపీ ప్లీనరీ సమావేశాలు సక్సెస్ అయ్యాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. రాబోయే రెండేళ్లలో ఏంచేస్తామో ప్లీనరీలో చెప్పామన్నారు.
MP Vijayasai Reddy : వైసీపీ ప్లీనరీ సమావేశాలకు 9 లక్షల మంది హాజరయ్యాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు దగ్గర చిప్ ఉందని ఆయనే అన్నారని, ఆ చిప్ మెదడులోంచి వేలికి వచ్చిందని తర్వాలో భూమిలోకి పోతుందని ఎద్దేవా చేశారు. ప్లీనరీ సక్సెస్ అవ్వడంతో చంద్రబాబు ఓర్చులేకపోతున్నారన్నారు. రాబోయే రెండేళ్లలో ఏం చేస్తామో ప్లీనరీలో స్పష్టం చేశామన్నారు. తిట్టడం మా ఎజెండా కాదన్న విజయసాయి రెడ్డి వెల్లడించారు. ప్లీనరీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడి తరఫున ధన్యవాదాలు అన్నారు. ఈ ప్లీనరీ సమావేశాలు పార్టీ చరిత్రలో సువర్ణాథ్యంగా మిగిలిపోతాయన్నారు. జనసముద్రంగా ప్లీనరీ జరిగిందన్నారు. సకల జనుల సాధికారత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగిందన్నారు. సామాజిక ఆర్థిక, రాజకీయ, మహిళా సాధికారత లక్ష్యంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు.
It was not just a plenary, it was a family function. We all came together to celebrate welfarism over fake news, hard work over daydreams, and the progress of the entire state rather than just the father-son duo. 1/2 pic.twitter.com/LRN1CrGGNd
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 10, 2022
20 కి.మీ మేర ట్రాఫిక్
స్పీకర్, మండలి ఛైర్మన్ పదవులు వెనకపడ్డ వర్గాల వారికి ఇచ్చిన ఘనత వైసీపీకే దక్కిందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రపంచమంతా వైసీపీని పొగుడుతుంటే చంద్రబాబు విమర్శలు చేయడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనం అన్నారు. 20 కి.మీ దూరం ట్రాఫిక్ నిలిచిందంటే ప్లీనరీ ఏ స్థాయిలో విజయవంతం అయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీ మహానాడులో తిట్టడం, తొడలు కొట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్లీనరీలో ఏం చేస్తామో, చేశామో చెప్పామన్నారు.
చంద్రబాబుకి చిప్ దొబ్బింది
ప్రతిపక్ష నేత చంద్రబాబుకి చిప్ దొబ్బిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. శనివారం ప్లీనరీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఈ మధ్య తీవ్రంగా ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతున్నారన్నారు. ఆయన మానసిక స్థితి బాగుందా లేదా అని మెడికల్ బోర్డుతో నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. ప్లీనరీకి వచ్చిన వారంతా అద్దె మనుషులంటూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలుచేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని అనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదన్నారు. లోకేశ్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదన్నారు. తండ్రీ కొడుకుల తీరుతో టీడీపీ భవిష్యత్తు అంధకారమైందని విజయసాయి రెడ్డి విమర్శించారు.