Breakup pain: లవ్ బ్రేకప్ అయితే ఎక్కువ బాధపడేది మగవాళ్లేనట... తేల్చిన కొత్త అధ్యయనం
ప్రేమలు, ప్రేమవివాహాలు సమాజంలో సాధారణమైపోయాయి. ప్రతి వీధికో లవ్ జంట లేదా లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు కనిపిస్తూనే ఉంటారు. ఇంతకుముందు ఆఫ్ లైన్ ప్రేమలే ఉండేవి. అంటే కాలేజీలోనో, వీధిలోనో, కోచింగ్ సెంటర్లోనో చూసి ప్రేమ చిగురించేది. ఇప్పుడు ఆన్లైన్ ప్రేమలు ఎక్కువైపోయాయి. ఫేస్‌బుక్, ఇన్ స్టా లో కూడా ప్రేమించేసుకుంటున్నారు. ప్రేమలు వరకు ఇద్దరూ హ్యాపీనే... కానీ బ్రేకప్ జరిగితే మాత్రం అదో మానసిక హింస. ఎవరికో తెలుసా? మగవారికి. జంట విడిపోయినప్పుడు ప్రియురాలి కన్నా ప్రియుడే ఎక్కువ బాధపడతాడట. ఇంగ్లాండుకు చెందిన లాంకెస్టర్ యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలో ఈ ఫలితం వచ్చింది. ఈ పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్ షిప్స్’ మ్యాగజైన్లో ప్రచురించారు.
![Cardiac Arrest | Heart Attack | వీకెండ్‌లో పార్టీలకు వెళ్తే సోమవారం గుండెపోటు వస్తుందా? | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/01/1d2796660d7b7de0c48411824a144d361711967429204310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)