Warangal Elections 2024: వరంగల్‌కు నేతల హామీలకు మోక్షం ఎన్నడో! ఎన్నికలు వస్తేనే గుర్తుకొస్తాయా?
Warangal News: ఎన్నికలు అనగానే నేతలు వచ్చి హామీలు ఇస్తారు. కానీ ఏళ్లు గడుస్తున్నా వరంగల్ కు ఇచ్చిన నేతల హామీలు అమలుకు నోచుకోవడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Warangal Elections 2024: వరంగల్: నేతల హామీలు నీటి మూటలు అవుతున్నాయి. ఏండ్ల తరబడి ప్రతి ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇస్తూ ఓట్లు రాబట్టుకున్నారు. నేతలకు పదవులు వస్తున్నాయి కానీ. ప్రజలకిచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. పార్లమెంటు ఎన్నికల వేళ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత ఎన్నికల హామీలే ఇప్పుడు ఇస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వరంగల్ పార్లమెంట్ లో పోటీ చేసే అన్ని పార్టీల అభ్యర్థులది ఒకటే మాట... ఒకే హామీలు. నేతలు అమలుకు నోచుకోని హామీలు ఇస్తున్నారా... లేక హామీల అమలలో నేతల చిత్తశుద్ధిని చాటుకోవడం లేదా అనుమానాలు లేకపోలేదు ప్రజలకు. అయితే పోటీలో ఉన్న అందరి నేతల ఒకటే కావడం ఎవరికో ఒకరికి ఓటు వేయక తప్పదు.
పెండింగ్ లో ఉన్న హామీలు ఇవే..
గత పది సంవత్సరాలుగా నేతల హామీల వివరాల్లోకి వెళ్తే... వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని ప్రతి ఎన్నికల సమయంలో ఇస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి వరంగల్ ప్రజలు నోచుకోవడం లేదు. వరంగల్ కార్పొరేషన్ గా ఉన్న నాటి నుండి ప్రతిపాదన మొదలైతే గ్రేటర్ వరంగల్ అయినా అమలు కావడంలేదు. అమలుకు అవకాశం ఉన్న నేతల చిత్తశుద్ధి, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పెండింగ్ పడుతూ వస్తోంది. మాస్టర్ ప్లాన్, డిపిఆర్ చేసిన అమలు కావడం లేదు. అమృత్, హృదయ్ పథకాల్లో చోటు దక్కిన ఫలితం లేకుండా పోతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీలు
ఇక మరో హామీ వరంగల్ ఎయిర్ పోర్ట్. దశాబ్దాల కాలంగా నగరవాసుల ఎయిర్ పోర్ట్ కల నెరవేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభానికి హామీల మీద హామీలు ఇచ్చిన ఎన్నికల్లో అజెండాగా మారిన ప్రారంభానికి అడుగు ముందు పడడం లేదు. వందకు వంద శాతం ప్రారంభించడానికి అవకాశం ఉన్న ప్రభుత్వాలు, స్థానిక ప్రజాప్రతినిధులు అటువైపు ప్రయత్నాలు చేయడం లేదు. సర్వేలు పేరుతో కాలయాపన చేస్తూ వెళ్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎయిర్ పోర్ట్ అంశాన్ని తీసుకువచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది.
వరంగల్ నగరంలో ఉపాధికి నిలయంగా ఉన్న అజాంజాహి మిల్లు మూతపడడంతో దాని స్థానంలో మరో టెక్స్టైల్ పార్క్ ప్రారంభించాలని ప్రభుత్వాలు యోచించాయి. ప్రభుత్వాలు అనుకున్న దశాబ్దాల కాలానికి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు బీజం పడ్డ టెక్స్టైల్ పార్క్ లో కంపెనీల రావడానికి ఆసక్తి చూపడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడంతో ఆయా కంపెనీలు ముందుకు రావడం లేదు. ఈ ఎన్నికల సందర్భంగా కూడా పోటీలో ఉన్న నేతలు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి పాటుపడతామని చెబుతున్నారు. కానీ ఎన్నికల ముందు చెప్పిన ఏళ్లు గడిచిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రం టెక్స్‌టైల్ పార్క్ నోచుకోవడం లేదు.
పారిశ్రామిక మారిడా ఇది కూడా నేతల హామీ హైదరాబాద్ టు భూపాల్ పల్లి పారిశ్రామిక కారిడార్ గా తీర్చిదిద్దుమని నేతల హామీలు కురిపించారు. కానీ పారిశ్రామిక కారిడార్ కు ఒక్క అడుగు కాదు కదా ఆ వైపు కూడా చూడడం లేదు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయడం తిరిగి మళ్లీ ఎన్నికలు వచ్చిన సమయంలోనే హైదరాబాద్ టు భూపాల్ పల్లి కారిడార్ గుర్తుకొస్తుంది. దీంతోపాటు కాజీపేట టు భూపాల్ పల్లి రైల్వే లైన్ మరో హామీ. ఈ హామీకి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్తారే తప్ప. రైల్వే లైన్ ఏర్పాటు కాలేదు. ఇలా హామీలన్నీ ప్రతి ఎన్నికల సమయంలో దశాబ్ద కాలానికి పైగా ఇస్తూ వస్తున్నారు.
ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి కానీ వరంగల్ జిల్లాకు ఇచ్చిన నేతల హామీలు మాత్రం నెరవేరడం లేదు. మరి ప్రభుత్వాల వైఫల్యమా? లేక హామీలు ఇచ్చి గెలిచిన ప్రజా ప్రతినిధుల కొరవలేకన అనేది ఓటర్లకు అర్థం కావడం లేదు. ప్రతి లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే తంతు కొనసాగుతోంది.