దసరా వచ్చిందంటే.. చాలు... పట్టణాల్లోని జనం.. పల్లెల్లో వాలిపోతారు. కానీ వెళ్లేటప్పుడే ఇబ్బందులు.  ప్రయాణికుల అవసరాల దృష్ట్యా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది.  ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ దసరాకు 4,045 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు.


Also Read: Dasara 2021: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...


దసరా సందర్భంగా  3,085 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, 950 బస్సులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి నడుపుతామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమైన బస్ స్టేషన్లు జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, దిల్‌సుఖ్‌గర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, అరాంఘర్ క్రాస్ రోడ్‌ల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులపై ఒకటిన్నర శాతం ఛార్జీలు అధికంగా వసూలు చేస్తామని అధికారులు చెప్పారు.  


Also Read: Devotional: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...


జూబ్లీ బస్ స్టేషన్ నుంచి.. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ వెళ్లే బస్సులు ఉంటాయి. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి వరంగల్, పరకాల, మహబూబాబాద్, భువనగిరి, యాదగిరి గుట్టకు వెళ్లే బస్సులు ఉంటాయి. నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు వెళ్లే వారి కోసం దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి బస్సులు ఉండనున్నాయి. కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపురం, ఒంగోలు, నెల్లూర్‌కు ఓల్డ్ సీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులుంటాయి. ఎంజీబీఎస్ నుంచి మిగిలిన బస్సులను నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు.


 


Also Read: Facebook Instagram Whatsapp Down: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల ఆందోళన


Also Read: Nitin Gadkari: హారన్ లో భారతీయ సంగీతం....శ్రావ్యమైన సంగీతం వినిపిస్తూ సైడ్ ప్లీజ్ అననున్న వాహనదారులు....


Also Read: Gold Smuggling: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..


Also Raed: నేటి నుంచి రాష్ట్రమంతా ‘స్వేచ్ఛ’ కార్యక్రమం.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం జగన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి