వెహికల్ తీసుకుని రోడ్డెక్కితే చాలు సౌండ్స్ తో గోలగోలగా ఉంటుంది. ఎక్కడైనా సిగ్నల్ దగ్గర కాసేపు ఆగి గ్రీన్ సిగ్నల్ పడగానే ముందుకి కదిలే లోపు వెనుక నుంచి చెవులు చిల్లులు పడేలా హారన్ కొడుతూనే ఉంటారు. ప్రధాన నగరాల్లో అయితే పక్కవారి మాట కూడా వినిపించనంతగా హారన్ సౌండ్స్ డామినేట్ చేసేస్తాయి. విపరీతమైన ధ్వని కాలుష్యం వల్ల ప్రయాణికులకు మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఇళ్లలో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పడం లేదు. అయితే ఇకపై ఇలాంటి హడావుడికి ఫుల్ స్టాప్ పడబోతోంది. వాహనాల హారన్ల శబ్దానికి సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక రోడ్లపై హారన్ సౌండ్ కి బదులు మంచి మంచి వాయిద్యాల ధ్వని వినిపించనుందట.
నాసిక్ లో జరిగిన హైవే ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా ధ్వని కాలుష్యం గురించి మాట్లాడుతూ హారన్లను మార్చబోతున్నట్లు వెల్లడించారు. త్వరలో మీరు ఈ వాహనాలనుంచి వచ్చే హారన్ శబ్దం నుంచి బయటపడతారన్నారు. హారన్లకు బదులు ప్రశాంతమైన సంగీత వింటారన్నారు వాహనాల హారన్ల బాధాకరమైన శబ్దం గురించి.. కేంద్ర మంత్రి తన మంత్రిత్వ శాఖ అధికారులు కార్ హారన్ల శబ్దాన్ని మార్చే పనిలో ఉన్నట్లుగా చెప్పారు. భారతీయ సంగీత సాధనాలైన పిల్లన గ్రోవి, తబలా, హార్మోనియం లాంటి వాటిని మాత్రమే వాహనాలకు హారన్‌లా అమర్చేలా చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. పోలీసు, అంబులెన్స్ వాహనాల సైరన్ శబ్ధాన్ని కూడా మార్చాలని భావిస్తున్నట్టు తెలిపారు. ‘మంత్రులు రోడ్లపై వెళ్తున్నప్పుడు పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్ శబ్ధం చేస్తూ వెళ్తాయి. ఇది చాలా చిరాకు కలిగిస్తుంది...ఈ శబ్దం చెవులకు కూడా మంచిది కాదు. అందుకే ఆకాశవాణిలో ఉదయం పూట వచ్చే సంగీతాన్ని సైరన్ శబ్ధంగా మార్చాలని అనుకుంటున్నాం. ఇది మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది’ అని చెప్పారు.
నితిన్ గడ్కరీ తన అనుభవాన్ని వివరిస్తూ.. తాను నాగపూర్‌లోని 11 వ అంతస్తులో నివసిస్తున్నట్లు చెప్పిన ఆయన..రోజూ ఉదయం ఓ గంట పాటు ప్రాణాయామం చేస్తానని ఆ సమయంలో రోడ్డుపై వాహనాల హారన్ల శబ్ధాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయన్నారు. “కార్ హారన్ శబ్దం ఇండియన్ మ్యూజిక్‌లా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందన్నారు. భారీ వాహనాలకు భారీ శబ్ధం వస్తుంటుంది. వాహనం తయారవుతున్నప్పుడే హార్న్ సెట్ చేస్తారు కాబట్టి..కొత్త నిబంధనల అమలు తర్వాత వాహనాల హారన్‌లకు బదులు తబలా, వయోలిన్, బుగ్లే, వేణు ట్యూన్స్ వినవచ్చన్నారు. నితిన్ గడ్కరీ కామెంట్స్ విన్న నెటిజన్లు మంచి ఆలోచనే కదా..మార్పు మంచిదే అంటున్నారు.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
Also Read: ఈ రాశులవారిలో ఆందోళన పెరుగుతుంది..వారి సమస్యలు పరిష్కారమవుతాయి..ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
Also Raed: నేటి నుంచి రాష్ట్రమంతా ‘స్వేచ్ఛ’ కార్యక్రమం.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం జగన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి