Facebook WhatsApp Down: ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ సేవలు నిలిచిపోయాయి. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు స్తంభించిపోయాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9గంటల సమయంలో  సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ సర్వర్స్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వీసులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.


గతంలో కొన్ని పర్యాయాలు వాట్సాప్ గానీ, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. కానీ గతానికి భిన్నంగా ప్రస్తుతం ఒకేసారి వాట్సాప్, ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ సేవలు చాలా సమయం నిలిచిపోవడం చర్చయనీయాంశం అయింది.  ఇది సైబర్ అటాక్ అయి ఉండొచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. చైనా హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.  ఫేస్ బుక్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.  






ఈ సామాజిక మాధ్యమాలపై ట్రోలింగ్..


ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగించే సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌తో పాటు.. అదే సంస్థకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్స్ వాట్సాప్, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవలు కూడా నిలిచిపోయాయి. వీటిసేవలు నిలిచిపోవడంతో మరో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ పై విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఫేస్‌బుక్ డౌన్‌ గ్లోబల్‌ ట్రెండింగ్‌గా మారిపోయింది.  దీంతో నెటిజన్లు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లను ట్రోల్ చేస్తున్నారు. ఈ మూడు యాప్స్, మాధ్యమాలు పనిచేయడం లేదని.. అదే సమయంలో ట్విట్టర్ సూపర్‌గా పని చేస్తున్నట్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫేస్‌బుక్‌ గ్రూపునకు చెందిన ఈ మూడు యాప్‌లను ప్రపంచజనాభాలో మూడొంతుల మంది ఉపయోగిస్తున్నారు. భారత్‌లో 41 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్లు ఉండగా.. వాట్సాప్‌ను 53 కోట్ల మంది వినియోగిస్తున్నారు.


Also Read: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. ధర ఎంతంటే?


 






ఫేస్ బుక్ సంస్థకు భారీ నష్టం..


ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో ఫేస్ బుక్ సంస్థకు భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. కేవలం కొన్ని నిమిషాల పాటు సేవలు అందుబాటులో లేనందున మార్కెట్లో ఫేస్ బుక్ సంస్థ షేర్ల విలువ 6 శాతం తగ్గినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఫేస్‌బుక్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరించేందుకు టెకీలు తీవ్రంగా యత్నిస్తున్నారు. సాంకేతిక లోపంతో ఇవి నిలిచిపోయిన కారణంగా వాట్సాప్ నుంచి సైతం నష్టం వాటిల్లనుంది.






ఈ సాంకేతిక సమస్యపై ట్విట్టర్ ద్వారా వాట్సాప్ స్పందించింది. యూజర్లకు గత కొన్ని నిమిషాల నుంచి సమస్య తలెత్తుతున్నాయని తెలుసు. అయితే త్వరలోనే సమస్యను పరిష్కరించి సేవలు పునరుద్ధరిస్తామని వాట్సాప్ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. సేవలు నిలిచిపోయినందుకు చింతిస్తున్నామంటూ ఫేస్ బుక్ సైతం స్పందించింది. సాధ్యమైనంత త్వరగా ఫేస్‌బుక్ సేవలు తిరిగి అందుబాటులోకి తెస్తామని ట్వీట్ ద్వారా పేర్కొంది.


Also Read: మామ ఆస్తిపై హక్కు కోసం కోర్టును ఆశ్రయించిన అల్లుడు.. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే!


 






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి