అయ్యా...అయ్యా...నేను చనిపోయానా బతికే ఉన్నానా..? అమ్మా అమ్మా మీకు నేను కనబడుతున్నానా..లేదా ఓ సారి చూసి చెప్పండమ్మా..ఇది ఎమ్మార్వో కార్యాలయం గుమ్మం దగ్గర కూర్చుని ఓ రైతు పడుతున్న ఆవేదన. వృద్ధాప్యంలో ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగెటట్టు కాదు.. కాళ్లు అరిగెటట్లే తిరుగుతున్నాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ అన్నదాత తను బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినందుకు ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పెగళ్లపాడుకి చెందిన కమల్ సాహెబ్ తన తమ్ముడు హుస్సేన్ సాహెబ్ తో కలిసి ఉంటున్నాడు. తనకు ఎకరం పొలం ఉండగా ఆ భూమిని ఇద్దరు పంచుకునేందుకు రెండేళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగారు.
Also Read: అప్పుల బాధతో విషం తాగి తండ్రి ఆత్మహత్య.. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకుని చిన్నారులూ..
ఎకరం పొలం కోసం
దీంతో ఓ వీఆర్వో సహాయంతో తన అన్న కమల్ సాహెబ్ మరణించాడని డాక్యుమెంట్లలో నమోదు చేయించాడు హుస్సేన్ సాహెబ్. ఈ విషయం తెలుసుకున్న కమల్ సాహెబ్ తన పేరు మీదున్న ఎకరం పొలం తీసేసుకునేందుకు బతికుండగానే చనిపోయాడని సొంత తమ్ముడే రికార్డులు సృష్టించాడని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ప్రాణాలతో తిరుగుతుంటే చనిపోయానని ఎలా రికార్డుల్లో మార్చారని ఆ వృద్ధుడు అధికారులను నిలదీస్తున్నాడు. కానీ ఈ విషయంపై అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాను బతికున్నట్లు సర్టిఫికెట్ తీసుకురమ్మని తిప్పుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవటంతో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కూర్చుని... వచ్చి పోయే వారికి నేను బతికి ఉన్నానా చనిపోయానా అని అడుగుతూ తన దీనస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: మద్యం వల్లే మాదాపూర్ యాక్సిడెంట్! ఆ కారుపై భారీ చలాన్లు, అన్నీ అలాంటివే..
Also Read: East Godavari Crime: గంజాయి రవాణాలో కొత్త దారులు.... బోర్ వెల్ లారీలో రూ.2 కోట్ల గంజాయి పట్టివేత...
Also Read: Chittor Rape: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి