ఒకప్పుడు వారానికి ఆరు రోజులు పనిదినాలు ఉండేవి. హెన్రీఫోర్డ్ విప్లవాత్మక నిర్ణయంతో ఐదు రోజులకు మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. కరోనా మహమ్మారి రావడం, ఉద్యోగస్థులు ఇళ్ల నుంచి పనిచేయడంతో హైబ్రీడ్ పని విధానం వైపు అడుగులు పడుతున్నాయి. కొన్ని దేశాలైతే వారానికి నాలుగు రోజుల పనిదినాల గురించి ఆలోచిస్తున్నాయి. అయితే బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ అంకురం 'స్లైస్' వినూత్నంగా ఆలోచించింది. మూడు రోజుల విధానం అమల్లోకి తీసుకొచ్చింది.
Also Read: వరుస నష్టాలకు చెక్.. మళ్లీ 60వేల వైపు సెన్సెక్స్
స్లైస్ ప్రస్తుతం వారానికి మూడు రోజుల పనిదినాలను ఆఫర్ చేస్తూ ఉద్యోగులను నియమించుకుంటోంది. మార్కెట్ రేటులో 80 శాతం వరకు వేతనాలను ఆఫర్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు ఉద్యోగంతో పాటు తమకు నచ్చిన లేదా ఆసక్తిగల రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని ఆ సంస్థ స్థాపకుడు రాజన్ బజాజ్ అంటున్నారు.
Also Read: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. రూ.30 వేలలోపే టచ్‌స్క్రీన్ కూడా!
'భవిష్యత్తు పని విధానం ఇదే. ప్రజలు ఒక్క ఉద్యోగానికే పరిమితం అవ్వాలనుకోవడం లేదు' అని బజాజ్ అన్నారు. ఉద్యోగుల కొరత నేపథ్యంలో ఈ విధానం తమను పోటీలో నిలబెడుతుందని ఆయన పేర్కొన్నారు. 'ఇదే అత్యుత్తమ విధానం. మూడు రోజుల విధానంలో ఉద్యోగస్థులు పూర్తి వేతనం, ప్రోత్సాహకాలు పొందుతారు. మిగతా సమయంలో తమ స్టార్టప్ ఇతర కలలను నెరవేర్చుకుంటారు' అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సంస్థకు 450 మంది ఉద్యోగులు ఉన్నారు. రాబోయే మూడేళ్లలో వెయ్యి మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను నియమించుకోబోతోంది.
Also Read: ఈ-శ్రమ్‌కు భారీ స్పందన.. 2.5 కోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి
ఈ కంపెనీని 2016లో స్థాపించారు. భారత్ యువకులకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తోంది. 2019లో ఫిజికల్ కార్డును ఆవిష్కరించింది. ఒక్క నిమిషంలోనే సైనప్ కావడం, క్యాష్‌బ్యాక్, మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్లు అందిస్తోంది. గత నెల్లో స్లైస్ ఏకంగా 1,10,000 కార్డులు జారీ చేయడం గమనార్హం. జపాన్‌కు చెందిన గునోసీ క్యాపిటల్, భారత్‌కు చెందిన బ్లూమ్ వెంచర్స్ ఈ అంకుర సంస్థలో పెట్టుబడులు పెట్టాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి