Top 5 Telugu Headlines Today 5 November 2023:
BRS ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఏం చెప్పింది?
తెలంగాణ ఎన్నికలు (Telangana Election 2023) ఈ సారి చాలా ఆసక్తికరంగా మారాయి. అధికార BRS పార్టీ హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టిగానే కసరత్తు చేస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఈ రికార్డుకి బ్రేక్‌లు వేయాలని చూస్తోంది. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే ABP Cvoter Opinion Poll ఆసక్తికర విషయాలు వెల్లడించింది. BRS పార్టీకి గరిష్ఠంగా 61 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించింది. అటు కాంగ్రెస్ 43-55 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మొత్తంగా చూస్తే హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పురందేశ్వరిది నీతిలేని చరిత్ర, దాంట్లో బహునేర్పరి - విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమె టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలిగా ఉంటున్నారని ఆరోపించారు. అలా ఉండడం అనైతికమని అన్నారు. తండ్రిని అవమాన పర్చిన కాంగ్రెస్‌లో నిస్సిగ్గుగా చేరారని, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారని విమర్శించారు. ఏపీ విభజన సమయంలో శకుని పాత్ర పోషించి అన్యాయం చేశారంటూ సోషల్ మీడియాలో విజయసాయి రెడ్డి పురంధేశ్వరిపై విమర్శలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మేడిగడ్డ వద్ద భయంకరంగా పరిస్థితి, పిల్లర్లకు పగుళ్లు కూడా - కిషన్ రెడ్డి
మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. తాను మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి చూసొచ్చానని, అది కుంగిపోవడమే కాకుండా పిల్లర్లకు కూడా పగుళ్లు వచ్చాయని అన్నారు. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని తెలిపారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని, రూ.1.3 లక్షల కోట్లకు పెంచారని, అయినా కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా పూర్తి చెయ్యలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పిందే నిజమైందని అన్నారు. తానే సూపర్ ఇంజినీర్ అని సీఎం కేసీఅర్ భావిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'పోలీసులు ప్రైవేట్ సైన్యంలా మారిపోయారు' - తాలిబాన్ల రాజ్యం గుర్తుకు తెస్తున్నారని లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ పోలీసులు వైసీపీ ప్రైవేట్ సైన్యంలా మారిపోయారని, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అణచివేతకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దళిత నేత ముల్లింగి వెంకటరమణను, కల్లూరు సీఐ కత్తి శ్రీనివాసులు అక్రమంగా నిర్బంధించి, చేతులు వెనక్కు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చిత్ర హింసలకు గురి చేశారని, ఇది తాలిబాన్ల రాజ్యాన్ని గుర్తుకు తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అందరికీ గవర్నమెంట్ జాబ్స్ తేలిక కాదు, అందుకే మేం ఇలా చేస్తున్నాం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 నుంచి 10 లక్షల వరకూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని, దాంట్లో కూడా ఎక్కడ ఎవరు రిటైర్ అవుతుంటే దాని ప్రకారం నింపుతూ ఉంటారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే యువత ఎక్కువగా ఉంటుందని అన్నారు. మై విలేజ్ షో టీమ్‌తో చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేటీఆర్ ఈ విషయాలను చెప్పారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి