పేదలకు ఇళ్లు రాకుండా బాబు అండ్ బ్యాచ్ చాలా ప్రయత్నాలు చేసింది: ఏపీ సీఎం జగన్
ప్రజలకు స్థలాలు ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని ముందుకెళ్తుంటే అడుగడుగునా అడ్డు తగిలిన ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్, టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇలా అంతా కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చాలానే కష్టపడ్డారని ఆరోపించారు. ఇంతటి దౌర్భాగ్య స్థితి ఒక్క ఆంధ్రరాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పట్టాలు అందించారు. అలాగే మోడల్ హౌస్‌లను పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి పైలాన్ ను ఆవిష్కరించారు.   పూర్తి వివరాలు


హామీల బ్రహ్మాస్త్రంతో సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌.. ఆగస్ట్‌లో అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో విడుదల
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను ఆకర్శించేందుకు, ఓటర్లను బీఆర్‌ఎస్ వైపు తిప్పుకునేలా మేనిఫెస్టోలో సరికొత్త పథకాలు పొందుపరిచే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలంగాణలో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దృష్టి సారించని, రంగాలు, వర్గాలపై దృష్టి సారిస్తున్నారు.  పూర్తి వివరాలు


వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి - జగన్‌ను మరోసారి గురి పెట్టిన పవన్ !
వైసీపీ పాలనలో చెట్లు కూడా విలపిస్తున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు.  కొట్టేసిన చెట్ల దృశ్యాలతో ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు.  ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు   ఈ విషయం కూడా తెలుసుకోవాలి...వృక్షో రక్షతి రక్షితః అని ట్వీట్ చేశారు.  పూర్తి వివరాలు  


ఆర్టీసీ నుంచి ఆటో వరకు ఏ వాహనం ఎక్కినా ఒకటే కార్డు- తెలంగాణలో కొత్త విధానం!
ఆర్టీసీ బస్సు నుంచి ఆటోల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా తెలంగాణ సర్కారు ఒకే కార్డును అందుబాటులోకి తీసుకు రాబోతుంది. ఆగస్టు రెండో వారంలో కామన్ మొబిలిటీ కార్డులను సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండే విధంగా ఈ కార్డు ఉండనుంది.  పూర్తి వివరాలు    


రసవత్తరంగా రామచంద్రాపురం రాజకీయం- పిల్లి తన దారి తాను చూసుకుంటారా?
రామచంద్రపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీలో కీలక నేతల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు అవసరమైతే తన ఎంపీ పదవికి, పార్టీకు రాజీనామా చేస్తానని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ వెంటే నడిచానని, పార్టీ ఆదేశాల మేరకే నడచుకున్నానని అన్నారు. కానీ అవకాశవాద రాజకీయాలు చేసే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలవబోనంటున్నారు.  పూర్తి వివరాలు