అసలే కాలం మారింది. దగ్గు, జలుబు, చర్మం అలెర్జీలు, కంటి అలెర్జీలు వంటివి వర్షాకాలంలో సులువుగా వచ్చేస్తాయి. వాతావరణంలో అధిక తేమ వల్ల, చుట్టుపక్కల నీటి నిల్వల వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు అధికంగా పెరుగుతాయి. అందుకే వానాకాలంలో వైరల్ వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా రెట్లు అధికం. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు... తుమ్ములు లేదా దగ్గు ద్వారా వ్యాప్తి చెందుతాయి. E.coli, సాల్మొనెల్ల, షిగేల్లా, నోరా వైరస్, రోటా వైరస్, స్టాప్ వైరస్ వంటివి కూడా అనేక రోగాలకు కారణం అవుతాయి. ఇవి ఒకరి నుంచి ఒకరికి వారు... వాడే వస్తువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా... కొన్ని వస్తువులను వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి. వాటినే వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు.


1. మీ కర్చీఫ్‌ను ఎంత అవసరమైనా ఇతరులతో పంచుకోవద్దు. ఎందుకంటే ఈ కర్చీఫ్ ఫై ఎన్నో రకాల బ్యాక్టీరియాలు చేరే అవకాశం ఉంది. వేరే వారిది మీరు వాడకండి. మీది వేరే వారికి ఇవ్వకండి.


2. టవల్‌ను కూడా వ్యక్తిగత వస్తువుగానే భావించాలి. చాలామంది ఒకే టవల్‌ను ఇద్దరు, ముగ్గురు తుడుచుకునే అవకాశం ఉంది. కాబట్టి వారే వాడుకుంటూ ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు టవల్స్ త్వరగా ఆరవు. దీనివల్ల వాటిపై బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. ఇవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.


3. చర్మంపై ఉండే బ్యాక్టీరియాను సబ్బు చాలా త్వరగా బదిలీ చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 62 శాతం బ్యాక్టరియాలు సబ్బుల వల్ల  వ్యాప్తి చెందినవే. అందుకే ఇతరులు ఉపయోగించే సబ్బులను ఉపయోగించడం మానేయండి. బహిరంగ ప్రదేశాల్లో ఉంచిన సబ్బులు పై కూడా అధిక బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇతరులు ఉపయోగించే స్నానపు స్పాంజ్‌లు, లూఫాలు వంటివి కూడా వాడడం మానేయాలి.


4. టూత్ బ్రష్‌లు... E.coli, స్టాప్ వంటి వైరస్, బ్యాక్టీరియాలను కలిగి ఉంటాయి. ఒకరు వాడిన బ్రష్ మరొకరు వాడకూడదు. దంత క్షయం వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. బ్రష్ ముళ్ళపై సూక్ష్మ క్రిములు చేరే ప్రమాదం ఎక్కువ. ఇది గొంతు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి.


5. చుండ్రు, జుట్టు రాలడం, పేనుకొరుకుడు సమస్య వంటివన్నీ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది. కాబట్టి దువ్వెనని కూడా మీరు జాగ్రత్తగా దాచుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సులు ఎక్కువ.


6. బాత్రూంలో ఉపయోగించే చెప్పులపై ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయి. వాటిని వేరే వారికి ఇవ్వడం గానీ, వేరే వారివి... మీరు వాడడం గాని చేయకూడదు. తడిగా ఉన్న పాదరక్షలు వేరే వాళ్ళు ఉపయోగించినట్లయితే... వారికి ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు మీకు వచ్చే అవకాశం ఉంది.


7. లిప్ బామ్ కూడా బ్యాక్టీరియాలు చేరవచ్చు. పెదవులపై ఉండే మృత కణాలు, సూక్ష్మ క్రిములు లిప్ బామ్‌పై చేరుతాయి. వాటిని వేరే వాళ్ళు వాడటం వల్ల, వారికి కూడా ఈ సూక్ష్మక్రిములు అంటుకునే అవకాశం ఉంది. అలాగే వేరే వాళ్ళవి మీరు కూడా వాడకూడదు. నోటి హెర్పస్ వంటి వ్యాధులు సోకవచ్చు.


Also read: ఇలాంటి ఆహారాలు, పానీయాలు తీసుకుంటే యూరిన్ చెడువాసన రావడం ఖాయం


Also read: చల్లని వాతావరణంలో చికెన్ సూప్ తింటే ఆ మజాయే వేరు

































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.