Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు ‘భోళా శంకర్’ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచా చిత్రాలు, పాటలు మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తదుపరి మూవీ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. మరోసారి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారట చిరు. ‘బింబిసార’ లాంటి సూపర్ హిట్ మూవీను తెరకెక్కించిన మల్లిడి వశిష్టతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట.
సోషియో ఫాంటసీ మూవీతో చిరు..
మెగాస్టార్ లాంటి హీరో నుంచి పాన్ ఇండియా సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. మల్లిడి వశిష్టతో ఈ మూవీను ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ సినిమా సోషియో ఫాంటసీగా పాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లో తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా మరోసారి పాన్ ఇండియాలో తరహాలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరు. మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ‘బింబిసార’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ సినిమాలోని స్టోరీ, స్క్రీన్ ప్లే, పాటలు, ఫైట్స్, మ్యూజిక్ అన్నీ బాగుండటంతో ప్రేక్షకులు మూవీను ఎంతగానో ఆదరించారు. అందుకే అలాంటి దర్శకుడితో చిరంజీవి మూవీ వస్తుందని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘ముల్లోక వీరుడు’ టైటిల్ ను ఖరారు చేశారా?
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇటు చిరంజీవి గానీ అటు దర్శకుడు వశిష్ట నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ మూవీ దాదాపు ఖాయం అయిపోందని, ‘భోళా శంకర్’ పూర్తవగానే ఈ మూవీను సెట్స్ పైకి తీసుకెళ్లనునన్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ మూవీలో ఇతర నటీనటులు ఎవరు అనేది తెలియలేదు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
చిరంజీవిను మెప్పించిన వశిష్ట..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ప్రాంతీయ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఆయన గతంలో ‘సైరా నరసింహారెడ్డి’ అనే పాన్ ఇండియా సినిమాలో నటించారు. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్ ను అందుకున్నా ఇతర భాషల్లో మెప్పించలేకపోయింది. దీంతో ఈ మూవీకు అనుకున్నంత వసూళ్లు రాలేదు. దీంతో చిరు పాన్ ఇండియా స్టోరీలను పక్కనబెట్టి లోకల్ కథలకు ఓకే చేస్తున్నారు. అందులో భాగంగానే ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ లాంటి కథలకు ఓకే చెప్పారు. అయితే ఇప్పుడు మల్లిడి వశిష్ట చెప్పిన సోషియో ఫాంటసీ థీమ్ బాగా నచ్చడంతో మరోసారి పాన్ ఇండియా మూవీకు ఓకు చెప్పారు చిరు. ఈ మూవీ సుమారు రూ.250 కోట్లతో తెరకెక్కనుందని సమాచారం. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. మరి ఈ మూవీతో మెగాస్టార్ తో వశిష్ట ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Also Read: క్రిస్మస్‌కు టాలీవుడ్ హీరోల పాన్ ఇండియా పోటీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial