మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ రిటైర్‌మెంట్‌- జగన్‌ సమక్షంలోనే ప్రకటన
మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆయన ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మాట్లాడిన పేర్ని నాని తన రాజకీయ జీవితంపై కామెంట్స్ చేశారు. నాని మాట్లాడుతున్న టైంలో సమయం మించిపోతుందని వెనుక ఉన్న లీడర్ చెప్పారు. దీంతో ఆయన నువ్వు ఎంత గిల్లినా నేను తగ్గబోనని... మాట్లాడి తీరుతానని అన్నారు. అందుకే రిటైర్ అవుతున్నానంటూ ప్రకటించేశారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి  


వైసీపీ ఎమ్మెల్యేలను పొగడటంపై కేశినేని నాని సీరియస్ కామెంట్స్
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తాను జీవితాంతం రాజకీయాల్లో ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేకుంటే కేశినేని భవన్‌లో కూర్చొని ప్రజలకు సేవ చేసుకుంటానంటూ వ్యాఖ్యానించారు.  కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఆదివారంలో వైసీపీ ఎమ్మెల్యేపై పొగడ్తల వర్షం కురిపించిన నాని ఇవాళ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్లను అభినందిస్తానన్నారు నాని.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


26న అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, మంచి జరిగి ఉంటే మద్దతివ్వండి: జగన్
అమరావతిలో ఈ నెల 26న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టబోతున్నట్టు సీఎం జగన్ తెలిపారు. సెంటు భూమిని ఉచితంగా పేదలకు ఇవ్వడమే కాకుండా అక్కడ ఇళ్లు కట్టించబోతున్నట్టు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు ఆయన గ్యాంగ్ అడ్డుకుంటుందన్నారు సీఎం జగన్. 


బందరు పోర్టుకు సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఏళ్ల నాటి కల ఎట్టకేలకు సాకారమైందన్నారు. సోమవారం ఉదయమే తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి పైలాన్‌ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ బందరు పోర్టు గురించి వివరించారు. అదే టైంలో ప్రతిపక్షాలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


80 వేల మందికి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు
వైద్యరంగంలో అత్యంత పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కొత్తగా ఎంపికైన 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీష్ రావు నియామక పత్రాలను అందజేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డు అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని అన్నారు. 1931 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించినట్లు స్పష్టం చేశారు. అలాగే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 22 వేల 263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో 9 వేల 222 పోస్టులకు రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎవరైనా ప్రమాదాలకు గురైనా, అనారోగ్యానికి గురైనా వారిని కాపాడే శక్తి కేవలం వైద్యులకు మాత్రమే ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలని కోరారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


అమెరికాలో ఆరోన్ క్యాపిటల్ ఛైర్మన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సౌకర్యాలు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీలు, ఇతర అంశాలను వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ ఏయే అంశాల్లో ఉత్తమంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఇచ్చే రాయితీలు, టీఎస్ బీపాస్ లాంటి విధానాల గురించి చెబుతూ ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు పూర్తి చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి