ఎన్డీఏలోకి కొత్త పార్టీల కోసం బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు - ఏ పార్టీలు రెడీగా ఉన్నాయి ?
2024 లోక్‌సభ ఎన్నికలలోపు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు చేసుకోవాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో  ఎన్‌డిఎలో తాజా శక్తిని నింపేందుకు బిజెపి కొత్త పొత్తులు పెట్టుకోవాలని చూస్తోంది. బీజేపీకి ప్రస్తుతం పూర్తి మెజార్టీ ఉంది. కానీ రాజకీయాల్లో ఎల్లప్పుడూ ఒకేరకమైన బలం ఉండదని అందరికీ తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితుల్ని గుర్తించి..  మిత్రపక్షాలతో తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో వచ్చినట్లుగా ఏకపక్ష ఫలితాలు వచ్చే రాష్ట్రాల్లో ఈ సారి ఎదురుగాలి వీస్తోంది.  అందుకే కొత్త మిత్రుల కోసం బీజేపీ వేట సాగిస్తోంది.  పూర్తి వివరాలు  


వారాహి యాత్రకు లైన్ క్లియర్-- ఈ రాత్రికే అన్నవరం చేరుకోనున్న పవన్
కాకినాడ జిల్లా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో బుధవారం నంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేపట్టే వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో టూర్‌ షెడ్యూల్‌ను జనసేన రిలీజ్ చేసింది. జనసేన కార్యాలయంలో యాగం చేస్తున్న పవన్ కల్యాణ్‌ పూర్ణాహుతితో యాగం పూర్తి చేయనున్నారు. అనంతరం అన్నవరం బయల్దేరి వెళ్లనున్నారు. పవన్ కంటే ముందుగానే వారాహి వాహనం అన్నవరం చేరుకోనుంది. అనుమతి విషయంలో రెండు రోజులుగా చాలా చర్చ నడిచింది. ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సంయమనంతో న్యాయపోరాటం చేస్తామని జనసేన ప్రకటించింది.  పూర్తి వివరాలు  


కార్యకర్తల్లో అసంతృప్తి పోగొట్టేలా వైసీపీ ప్లాన్- అనుబంధ సంఘాలతో విజయసాయి వరుస భేటీలు
పార్టీ విజయం కోసం పని చెయ్యండంటూ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి క్యాడర్ కు పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకాలాపాలను వేగవంతం చేసే క్రమంలో భాగంగా విజయసాయి రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశం అవుతున్నారు. గత వారం రోజులుగా అనుబంధ సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు విజయసాయిరెడ్డి. పార్టీలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయ సూచిస్తున్నారు.  పూర్తి వివరాలు  


నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు కీలక నేత గుడ్ బై - కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం !
బీఆర్ఎస్ కీలక నేత కూచాడి శ్రీహరి రావు రాజీనామా చేశారు.  బిఆర్ఎస్ పార్టి పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు కూచాడి శ్రీహరి రావ్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తన అనుచరుల సమక్షంలో అధికారికంగా బిఆర్ఎస్ పార్టికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో తన ముఖ్య అనుచరులతో శ్రీహరి రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానుల సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  పూర్తి వివరాలు


సుప్రీంలో అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ- స్వయంగా వాదనలు వినిపించిన సునీత
వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీత పిటిషన్ వేశారు. దీన్ని విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ నుంచి విచారణ ప్రారభించింది. అవినాష్‌ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన సునీత తానే స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సహకరంచేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాను సుప్రీంకోర్టు బెంచ్ అనుమతించింది.  పూర్తి వివరాలు