చాలా మందికి కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పక్షులు పెంచుకుంటారు. వాటితో చక్కటి అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు. ఒక్కోసారి వాటికి ఏమైనా ఇబ్బంది కలిగితే అస్సలు తట్టుకోలేరు. కొన్నిసార్లు అవి చనిపోతే కంటతడి పెడతారు. తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన కంటతడి పెట్టారు. దానితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.


పెట్ డాగ్ మృతిపై సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్


హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలంగా టాంగో అనే ఓ కుక్కని పెంచుకుంటున్నారు. ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా తను టాంగోతో ఎంజాయ్ చేసేవాడు. దానితో కలిసి సరదగా గడిపోవాడు. పలుమార్లు టాంగోతో ఆడుకుంటున్న ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా ఆరోగ్య సమస్యలతో టాంగో చనిపోయింది. దాని మృతిని ఆయన తట్టుకోలేక ఎమోషనల్ అయ్యాడు. పెంపుడు కుక్కతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ లెటర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ లేఖలో ఆయన ఎన్నో విషయాలను వెల్లడించాడు.


“టాంగో, నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు చాలా తేలికగా, హ్యాపీగా ఉంటుంది. నువ్వు లేవు అనే విషయాన్ని తట్టుకోలేక పోతున్నాను.  నువ్వు లేవనే విషయాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాను. నన్ను నువ్వు ఎన్నోసార్లు కాపాడావు. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు ఇచ్చావు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నవ్వించావు. నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్నావు. నువ్వు నాతో ఉన్న క్షణాలన్నీ ఎంతో అమూల్యమైనవి. నాకు నీ నుంచి ఎంతో ప్రేమ లభించింది. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నా దగ్గరికి వచ్చిన తొలి రోజు ఇప్పటికి వరకు ఎన్నో జ్ఞాపకాలు నీతో ఉన్నాయి. లవ్ యు మై బండ ఫెలో, టాంగో” అంటూ ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌పై మంచు మనోజ్ కూడా స్పందించాడు. ధైర్యంగా ఉండాలని సాయి ధరమ్ తేజ్‌ను ఓదార్చాడు. తేజ్ అభిమానులు, కొందరు సినీ నటీనటులు కూడా టాంగో మృతి పట్ల సంతాపం తెలిపారు.






పవర్ స్టార్ తో కలిసి ‘బ్రో’ సినిమా చేస్తున్న  సుప్రీం హీరో


సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... జూలైలో మావయ్య పవన్ కల్యాణ్ తో కలిసి 'బ్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ కనిపించనున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'వినోదయ సీతం' చిత్రానికి తెలుగు రీమేక్ ఈ 'బ్రో'. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రలో పవన్ కల్యాణ్ ప్రేక్షకులకు కనిపించనున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు.


Read Also: విజయ వర్మతో తమన్నా డేటింగ్ - అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ