Sakshi Vaidya New Movie : మరో మెగా హీరో సినిమాలో 'ఏజెంట్' భామ సాక్షి వైద్య

'ఏజెంట్' సినిమాతో ఉత్తరాది భామ సాక్షి వైద్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. మెగా హీరో వరుణ్ తేజ్ 'గాంఢీవధారి అర్జున' సినిమాలో కూడా నటిస్తున్నారు. మరో మెగా హీరో సినిమాలో ఆమె ఛాన్స్ అందుకున్నారు. 

Continues below advertisement

'ఏజెంట్'లో అఖిల్ అక్కినేనికి జోడీగా నటించిన నార్త్ ఇండియన్ అమ్మాయి, యువ కథానాయిక సాక్షి వైద్య (Sakshi Vaidya) గుర్తు ఉన్నారా? తెలుగులో ఆమెకు తొలి సినిమా అది. 'ఏజెంట్' విడుదలకు ముందు తెలుగులో మరో అవకాశాన్ని ఆమె అందుకున్నారు. 

Continues below advertisement

'గాంఢీవధారి అర్జున'లో...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'గాంఢీవధారి అర్జున' (Gandeevadhari Arjuna Movie). అందులో సాక్షి వైద్య కథానాయిక. ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగా మరో మెగా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారని తెలిసింది. 

సాయి తేజ్ జోడీగా సాక్షి వైద్య!
వంద కోట్ల వసూళ్ళు సాధించిన 'విరూపాక్ష' సినిమా విజయం సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)కు, హీరోగా అతని కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.  ఇప్పుడు ఆయన వచ్చే నెలలో కొత్త సినిమా చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో సాక్షి వైద్యను కథానాయికగా ఎంపిక చేశారని తెలిసింది. 

సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. దాంతో జయంత్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'విరూపాక్ష' విజయం తర్వాత మరోసారి హీరో, దర్శకుడు కలిసి చేస్తున్న చిత్రమిది. 'విరూపాక్ష' విడుదల కంటే ముందు కొబ్బరికాయ కొట్టారు. సినిమాను అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాలో సాక్షి వైద్య సెలెక్ట్ అయ్యారు. 

'ఏజెంట్' విడుదల కంటే ముందు సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం సాక్షి వైద్యను అప్రోచ్ అయ్యారట. బహుశా... సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత ఆమెను ఎంపిక చేసినట్టు వెల్లడిస్తారేమో!? జూలైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్... బ్యాక్ టి బ్యాక్ మెగా హీరోల సినిమాల్లో సాక్షి వైద్య ఛాన్సులు అందుకున్నారు. నెక్స్ట్ ఎవరితో చేస్తారో చూడాలి.

Also Read : ఏపీలో షూటింగులు - దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా!

జూలైలో 'బ్రో'తో ప్రేక్షకుల ముందుకు...
'విరూపాక్ష' విజయంతో సంతోషంగా ఉన్న సాయి ధరమ్ తేజ్... వచ్చే నెలలో మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మామ అల్లుళ్ళు కలిసి నటించిన సినిమా 'బ్రో'. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ 'శంభో శివ శంభో', నాని 'జెండా పై కపిరాజు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

'బ్రో' సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. ఆ పాట కోసం భారీగా ఖర్చు చేసినట్టు తెలిసింది. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాలకు సంగీత సంచలనం తమన్ అందించిన  పాటలు అభిమానులకు నచ్చాయి. మరోసారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఆయన మ్యూజిక్ ఇస్తున్నారట. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

Also Read పూజా హెగ్డే డిమాండ్ తగ్గలేదు - ఏకంగా ఆరు సినిమాలు...

Continues below advertisement
Sponsored Links by Taboola