పూజా హెగ్డే (Pooja Hegde) ట్రాక్ రికార్డ్ బహుశా తెలుగులో ఈతరం కథానాయికలు ఎవరికీ లేదేమో!? ఒకటి రెండు కాదు... ఏకంగా ఆరు విజయవంతమైన సినిమాలు చేశారు. 'డీజే దువ్వాడ జగన్నాథం' నుంచి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వరకు... డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. అయితే... ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవీ అంతగా సక్సెస్ కాలేదు. పూజా హెగ్డేకు పేరొచ్చినా... ఫ్లాప్స్ రావడంతో ఆమె పని అయిపోయిందని, ఆమె క్రేజ్ తగ్గిందని కొందరు కామెంట్ చేశారు. అయితే, పూజా హెగ్డే డిమాండ్ ఏం తగ్గలేదు. క్రేజీ కథానాయికల లిస్టులో ఆమె పేరు ముందు వరుసలో ఉంది. కొత్తగా మూడు సినిమాలకు సంతకం చేశారని సమాచారం. మరో మూడు చర్చల దశలో ఉన్నాయట. 


తమిళంలో ఒకటి, కన్నడలో ఒకటి!
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం' చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అది కాకుండా తమిళంలో ఓ సినిమా, కన్నడలో మరో సినిమా డిస్కషన్ స్టేజిలో ఉన్నాయట. కన్నడలో టాప్ స్టార్ నటించబోయే పాన్ ఇండియా సినిమా కోసం పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు ఉన్నాయట. 


పూజా హెగ్డే సక్సెస్ రేట్ ఎక్కువ! 
తెలుగు సినిమా ఇండస్ట్రీ పూజా హెగ్డేకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్... డబుల్ హ్యాట్రిక్ అందించింది. మధ్యలో 'సాక్ష్యం'ను పక్కన పెడితే... 'దువ్వాడ జగన్నాథం' నుంచి 'అల వైకుంఠపురములో' సినిమా వరకు, పూజా హెగ్డే చేసిన ప్రతి సినిమా హిట్టే. ఆఖరికి 'జిల్ జిల్ జిల్ జిగేలు రాణి' అంటూ స్పెషల్ సాంగ్ చేసిన 'రంగస్థలం' హిట్టే. ఆమె గోల్డెన్ లెగ్ అని ప్రశంసలు కురిపించారు. తెలుగులో పూజా హెగ్డే విజయాలు చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అవకాశాలు అయితే వచ్చాయి గానీ... విజయాలు రాలేదు. అందుకని, కథల ఎంపికలో పూజా హెగ్డే మరింత జాగ్రత్త వహించడం మొదలు పెట్టారు. 


హిందీలో అవకాశాలు వస్తున్నా సరే... 
వరుస ఫ్లాప్స్ పూజా హెగ్డే కెరీర్ మీద ప్రభావం చూపించలేదని, ఆమె డిమాండ్ ఏం తగ్గలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హిందీ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఛాన్సులు వస్తున్నా... వెంటనే ఓకే చెప్పడం లేదట. తన పాత్రతో పాటు కథ ఎలా ఉంది? కంటెంట్ కనెక్ట్ అయ్యేలా ఉందా? లేదా? వంటి విషయాలు అన్నీ ఆలోచించి ఓకే చెబుతున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు 'గుంటూరు కారం' షూటింగ్ చేస్తున్న పూజా హెగ్డే... ఈ ఏడాది మొత్తం ఆరు సినిమాల షూటింగులు చేయాలని, ఒకట్రెండు నెలల్లో వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ అవుతాయని టాక్. 


Also Read : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయికగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. అందులో శ్రీ లీల ఓ కథానాయిక. మరో అందాల భామకు సైతం చోటు ఉందని సమాచారం. ఆ రోల్ పూజా హెగ్డే చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే, అధికారికంగా ఎవరు అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ఆ సినిమాలో పూజా హెగ్డే చేస్తే... పవన్ సరసన తొలి సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది.


Also Read : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?