Top 10  News Today: 


టీడీడీ-జనసేన బంధానికి బీటలు..?

పిఠాపురంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓ మంత్రి పనితీరు గురించి మరో మంత్రి ఇలా బహిరంగంగా మాట్లాడటంతో ఇది వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలతో కూటమి పార్టీల మధ్య సంబంధాలు బీటలు వారినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎవరూ వ్యతిరేకంగా స్పందించలేదు. ఎవరైనా ఆవేశపడితే చినికి చినికి గాలివానగా మారుతుంది కాబట్టి అందరూ సంయమనంతో మాట్లాడారు. పవన్ ఇలా మాట్లాడి ఉండకూడదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

వైసీపీపై షర్మిల సంచలన ట్వీట్..!

వైసీపీ, కూటమి పార్టీలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ చేసింది పాపం అయితే.. రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ పెడుతున్నది శాపం అని ఆమె పేర్కొన్నారు. కరెంట్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల నెత్తినే మోపుతోందన్నారు. అలానే కూటమి సర్కారు ప్రజలకు భారీ కరెంటు షాక్ ఇచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు


తెలంగాణలో జరుగుతున్న కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు.50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి అన్ని కులాలకు దామాషా ప్రకారం అవకాశం కల్పిస్తామని   ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



 

ఏపీలో అర్చకుల కనీస వేతనం పెంపు

ఆలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ ప్రకటించారు. ‘అర్చకులకు రూ.15వేల వేతనం ఇవ్వాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరనుంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10కోట్ల మేర అదనపు భారం పడనుంది. వేద పండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి కలుగుతుంది’ అని మంత్రి ఆనం వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

  సెంటిమెంట్‌తో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ చెక్

కాంగ్రెస్ పార్టీ నల్లగొండ సెంటిమెంట్‌ను పండించి.. బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజల్ని వ్యతిరేకించినట్లే అన్న భావన తీసుకు వచ్చేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పరిధిలో పుట్టిన రోజున రోజు నాడు పాదయాత్ర చేయబోతున్నారు. మూసి ప్రాంత ప్రజలతో పాటు మూసి కాలుష్యం వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఆయన పరిశీలిస్తారు. పాదయాత్రకు నల్లగొండజిల్లాలోని మూసీ ప్రాంతాలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఎంచుకున్నారని అర్థమయిపోతుంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

లండన్‌లో మెరిసిన తెలంగాణ పర్యాటకశాఖ

లండ‌న్ వేదిక‌గా ప్రపంచ ప‌ర్యాట‌క ప్రద‌ర్శన‌లో తెలంగాణ ప్రభుత్వం మెరిసింది. సాంకేతిక ప‌రిజ్ఞానం - ప‌ర్యాట‌క రంగానికి మేలు చేసే అవ‌కాశాలు థీమ్ తో లండ‌న్ వేదిక‌గా ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ స్టాల్ ను యూకేలో భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా  తదితరులు సందర్శించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

ఆమరణ దీక్ష విరమించిన ఎమ్మెల్యే

అటవీ అధికారుల దౌర్జన్యానికి నిరసనగా  కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ అటవీ కార్యాలయం ముందు రైతుల పక్షాన ఆమరణ దీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. సిర్పూర్ నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారుల వేధింపులు అధికమయ్యాయని , ఇష్టారీతిన రైతులు, గ్రామస్తులను కొడుతున్నారని, ఇటివలే ఓ రైతుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆ అటవీ శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..  

 

 

అధ్యక్ష ఎన్నికల్లో దూసుకుపోతున్న ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ సెంచరీ దాటారు. ప్రాథమిక ఫలితాల్లో ఇప్పటివరకు 101 ఎలక్టోరల్ ఓట్లతో కమలా హరీస్ కన్నా ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ 10 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ముందు నుంచి అనుకున్నట్లుగా ట్రంప్‌కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్లు సర్వే ఏజెన్సీలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

బిగ్ అలర్ట్.. ఐపీఎల్ మెగా వేలం డేట్ వచ్చేసింది!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. నవంబర్ 24, 25వ తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. సౌదీ అరేబియా జెడ్డాలో ఈ వేలం ప్రక్రియ చేపట్టనున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో భారత ఆటగాళ్లు 1,165 మంది, విదేశీ ఆటగాళ్లు 409 మంది ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే మూవీ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అనే విషయంపై మాత్రం ఇప్పటిదాకా మెగా ఫాన్స్ కి క్లారిటీ లేదు. తాజాగా దిల్ రాజు ఆ క్లారిటీని కూడా ఇచ్చేశారు. ఈ నెల 9న లక్నోలో 'గేమ్ ఛేంజర్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..