TATA IPL 2025 Player Auction | హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబందించి బిగ్ అప్ డేట్ వచ్చింది. నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. సౌదీ అరేబియా జెడ్డాలో వచ్చే ఐపీఎల్ సీజన్ల కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ చేపడతామని ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రతి ఫ్రాంచైజీ అత్యధికంగా 25 మంది ఆటగాళ్లతో  స్క్వాడ్‌ను పూర్తి చేసుకోవాలి. TATA IPL 2025 మెగా వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తీసుకుంటాయి.

నవంబర్ 4తో ఐపీఎల్ మేగా వేలానికి సంబంధించి ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో భారత ఆటగాళ్లు 1,165 మంది, విదేశీ ఆటగాళ్లు 409 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం ఆటగాళ్లలో క్యాప్డ్ ప్లేయర్స్ 320 మంది ఉండగా, అన్ క్యాప్డ్ ప్లేయర్లు 1,224 మంది, మరో 30 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు. 

ఆటగాళ్ల జాబితా..
క్యాప్డ్ ఇండియన్స్ (48 మంది)
అంతర్జాతీయ ఆటగాళ్లు (272 మంది)
గత IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు (152 మంది)
గత IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ ఇంటర్నేషనల్స్ (ముగ్గురు)
అన్‌క్యాప్డ్ ఇండియన్స్ (965 మంది ఆటగాళ్లు)
అన్‌క్యాప్డ్ అంతర్జాతీయ ఆటగాళ్లు (104 మంది)

దేశాల వారీగా 409 మంది విదేశీ ఆటగాళ్ల జాబితా

దేశం

రిజిస్ట్రేషన్ ఆటగాళ్లు

ఆఫ్గనిస్తాన్

29

ఆస్ట్రేలియా

76

బంగ్లాదేశ్

13

కెనడా

4

ఇంగ్లాండ్

52

ఐర్లాండ్

9

ఇటలీ

1

నెదర్లాండ్

12

న్యూజిలాండ్

39

స్కాట్లాండ్

2

దక్షిణాఫ్రికా

91

శ్రీలంక

29

యూఏఈ

1

అమెరికా

10

వెస్టిండీస్

33

జింబాబ్వే

8

ఇటీవల విడుదలైన ఐపీఎల్ రిటెన్షన్ జాబితా

ఐపీఎల్ 2025 (IPL - 2025-27) రిటెన్షన్ జాబితా ఇటీవల విడుదలైంది. గత గురువారం ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. రిటెన్షన్ జాబితాలో హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్  హైదరాబాద్) రూ.23 కోట్ల అత్యధిక ధరను దక్కించుకున్నాడు. ఆర్సీబీ రూ.21 కోట్లకు విరాట్ కోహ్లీ (Virat Kohli)ని రిటైన్ చేసుకుంది. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రూ.16.30 కోట్లు, పాట్ కమిన్స్ రూ.18 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ - రూ.18 కోట్లు, యశస్వి జైస్వాల్ - రూ.18 కోట్లకు తీసుకుంది.

గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్ ను రూ.18 కోట్లు, శుభ్‌మన్ గిల్ - రూ.16.5 కోట్లు, ముంబయి ఇండియన్స్ జస్‌ప్రీత్ బుమ్రా - రూ.18 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్  రుతురాజ్ గైక్వాడ్ - రూ.18 కోట్లు, రవీంద్ర జడేజా - రూ.18 కోట్లు, మతిశ పతిరన - రూ.13 కోట్లు, ఎంఎస్ ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. లక్నో కేఎల్ రాహుల్‌ను, ఢిల్లీ రిషబ్‌పంత్‌ను, కోల్‌కతా శ్రేయస్ అయ్యర్‌ను వదిలేసింది. ఆర్సీబీ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, సిరాజ్‌లను వదులుకుంది. 

Also Read: India WTC Final: టెస్ట్ చరిత్రలో తొలిసారి వైట్ వైష్, భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఏం చేయాలి?