ICC WTC Final Scenarios: న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో 3-0తో భారత్ వైట్ వాష్ అయింది. టెస్టు చరిత్రలో మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్ లో అన్ని టెస్టుల్లో ఓడిపోయి భారత్ వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. దాంతో 2023 - 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ స్థానంపై సందిగ్ధత నెలకొంది. కివీస్ చేతిలో దారుణ పరాభవంతో భారత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి పడిపోయింది. దాంతో భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. 


టీమిండియాకు ఐసీసీ నిర్వహించనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ అది అంత తేలిక కాదు. రెండు వరుస టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరినా.. భారత్ రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఎలాగైనా తమను ఊరిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నెగ్గి టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలవాలని భావిస్తున్న భారత్ కు కివీస్ తో సిరీస్ పరాభవంతో అవకాశాలు మరింత తగ్గాయి. ఈ డబ్ల్యూటీసీ రెండేళ్ల సైకిల్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే ఫైనల్ చేరుతాయని తెలిసిందే. 


భారత్‌కు పరీక్ష పెట్టిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ


త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా అక్కడ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. 5 టెస్టుల ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ను భారత్ 4-0తో నెగ్గాల్సి ఉంటుంది. నాలుగు టెస్టుల్లో విజయం సాధించి, మరో మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికీ భారత్ 65.79 శాతంతో ఉంటుంది. న్యూజిలాండ్ కు గరిష్టంగా 64.29 శాతం విజయాలు ఉండనున్నాయి. అది కూడా స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుపై 3-0తో కివీస్ ఘన విజయం సాధించాల్సి ఉంటుంది. 



భారత్ కనుక 4-0తో ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ నెగ్గితే, ఎంత కాదనుకున్నా పాయింట్ల పట్టికలో కచ్చితంగా రెండో స్థానంలో నిలవనుంది. దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంక, పాకిస్తాన్ ల మీద సిరీస్ లు నెగ్గితే గరిష్టంగా 69.44 శాతంతో సఫారీలు అగ్రస్థానంలో నిలనున్నారు. ఆ లెక్కన చూస్తే ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేస్తేనే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరుతుంది. 


Also Read: IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?


ఒకవేళ ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిస్తే..
భారత్ కనుక ఆస్ట్రేలియా చేతిలో ఓడినా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే ఛాన్స్ ఉంది. కానీ అది అంత తేలిక కాదు. భారత్ మీద ఆస్ట్రేలియా 2-3 తో నెగ్గి, అదే సమయంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా కావాలి. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో జరగనున్న సిరీస్ లను దక్షిణాఫ్రికా 0-0తో డ్రా చేసుకోవాలి. ఇవన్నీ జరిగితే కనుక ఆస్ట్రేలియా 58.77 శాతం విజయాలతో అగ్ర స్థానంలో నిలుస్తుంది. 53.51 శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లోకి దూసుకెళ్తుంది. దక్షిణాఫ్రికా 52.78 శాతంతో మూడో స్థానం, శ్రీలంక 51.28 శాతంతో నాలుగో స్థానంలో నిలవనున్నాయి. అయితే ఇది జరిగేందుకు అవకాశాలు చాలా తక్కువ కనుక. ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టులు నెగ్గితేనే భారత్ టెస్ట్ ఛాంపియన్ పై ఆశలు ఉంటాయి.