Morning Top News:


ములుగులో భూకంపం


తెలుగు రాష్ట్రాల్లో  పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలలో భయాందోళనలు కలిగించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయం 7:27 గంటలకు తెలంగాణలోని ములుగులో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఏపీలో 104 ఉద్యోగులపై ఎస్మా


రాష్ట్రంలోని 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాలని ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది.   వైద్య శాఖలోని 104 విభాగం లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో ఆరు నెలలపాటు ఎలాంటి బంద్ లూ, నిరసనలు చేపట్టరాదంటూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి  కృష్ణ బాబు  ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తున్నట్టు  ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనల ఉల్లంఘన వ్యవహారంలో సంజయ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నిధులు, అధికారం దుర్వినియోగం చేశారని సంజయ్‌పై అభియోగాలున్నాయి. టెండర్లు లేకుండా ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు కొనుగోలు చేశారని, అగ్నిమాపకశాఖ డీజీగా ఉన్నప్పుడు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


ఏపీలో రంగంలోకి మ‌ల్టీప‌ర్ప‌స్ డ్రోన్లు


భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేరాల నియంత్ర‌ణ‌కు డ్రోన్లను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు.  ట్రాఫిక్ ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎన్ని వాహ‌నాలున్నాయి, అక్క‌డ తీసుకోవాల‌న్సిన చ‌ర్య‌లు ఏంటీ, భ‌ద్ర‌త‌కు సంబంధించి ఆయా మార్గాల్లో ఉన్న లోటుపాట్ల‌ను ఈ డ్రోన్ల‌ను రియ‌ల్ టైమ్ లో అంచ‌నావేసి చేర‌వేస్తాయని ఆ సంస్థ నిర్వాహ‌కులు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



 

కాకినాడ పోర్టులో సీజ్ చేసింది రేషన్ బియ్యమే: కలెక్టర్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కాకినాడ పోర్టు వ్యవహారంపై కలెక్టర్ షాన్ మోహన్ స్పందించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో విదేశీ నౌక స్టెల్లాను సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. స్టెల్లా ఓడలోకి రేషన్ బియ్యం ఎలా వచ్చిందన్న విషయాలు త్వరలో తెలుస్తాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. గోదాంల నుంచి పోర్టులోని షిప్ వరకూ రేషన్ బియ్యం అక్రమ రవాణా అయిందన్న దానిపై దృష్టి పెట్టామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ఇక వేగంగా భవన నిర్మాణ అనుమతులు

తెలంగాణలో భవనాలు, లేఅవుట్ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏ అధికారి దగ్గర కూడా 10 రోజులకు మించి ఆలస్యం లేకుండా ప్రక్రియ ముందుకు సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవనాలు, లే అవుట్ల అనుమతులకు ‘బిల్డ్‌ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

హరీశ్‌రావుపై కేసు నమోదు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై కేసు నమోదు అయ్యింది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని బాచుపల్లికి చెందిన చక్రదర్‌గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

దారితప్పిన టీచర్ కు చెప్పుతో గుణపాఠం

విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు బుద్ధి తక్కువ పని చేస్తున్నoదుకు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన ఓ సంఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి  వచ్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ, అదే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని  పట్టుకుని చెప్పుతో చితకబాదారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


మహా‘ ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు

మహారాష్ట్రలో కొలువుదీరనున్న మహాయుతి ప్రభుత్వంలో చేరే అవకాశం ఉన్న 17 మంది మంత్రుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆపద్ధర్మ సీఎం ఏకనాథ్ షిండే శివసేన నుంచి 7గురికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణం చేసే ఛాన్స్ ఉండగా, మహాయుతి క్యాబినెట్‌ జాబితాలో రాహుల్‌ నార్వేకర్‌, నితేశ్‌ రాణే, ఆశిష్‌ షెలార్‌, గిరీష్‌ మహాజన్‌ పేర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


చిరు మూవీకి నాని నిర్మాత

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. అయితే, ఈ సినిమాను హీరో నాని ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాని తన Xలో వెల్లడించారు. 'హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు. అంటూ పంచుకున్న పోస్టర్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..