Adilabad News | విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు బుద్ధి తక్కువ పని చేస్తున్నoదుకు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన ఓ సంఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి  వచ్చింది.


రోడ్డు మీద చెప్పుతో కొట్టిన బాలిక కుటుంబం


మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు సత్యనారాయణ, అదే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విసిగి వేసారిపోయిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనను దృష్టికి తీసుకు వెళ్ళింది, దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని  పట్టుకుని చెప్పుతో చితకబాదారు.




అసభ్యంగా ప్రవర్తించిన తెలుగు ఉపాద్యాయుడు సత్యనారాయణ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.  సభ్యసమాజంలో భావి భారత పౌరులను తయారు చేయాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


కులాంతర వివాహంపై కోపం, ఎకరం పొలం కోసం దారుణం 
కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో రగిలిపోతున్న యువకుడు ఎకరం భూమిపై బాండ్ రాసివ్వలేదని కక్షతో సొంత అక్కను కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్‌ శివారు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌ గ్రామానికి చెందిన నాగమణి(27)కి పదేళ్ల కిందట వివాహమైంది. కానీ భర్తతో మనస్ఫర్థలతో 2022లో ఆమె విడాకులు తీసుకుంది. మరోవైపు 2020లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి నాగమణి ఎంపికైంది. హయత్‌నగర్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఆమెకు ఓ అక్క, తమ్ముడు పరమేశ్‌ (24) ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పెదనాన్న వద్ద ముగ్గురు పెరిగారు. 


ఇటీవల విడాకులు తీసుకున్న అనంతరం గ్రామానికే చెందిన స్నేహితుడు బండారి శ్రీకాంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. శ్రీకాంత్‌ తక్కువ కులం వాడని సోదరుడు పరమేశ్‌ వివాహానికి అంగీకరించకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఎవరి అంగీకారం లేకుండానే ఈ నవంబరు 10న యాదగిరిగుట్టలో శ్రీకాంత్, నాగమణి పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఇబ్రహీంపట్నం పోలీసులను సంప్రదించగా.. రెండు కుటుంబాలకు సర్దిచెప్పారు. నాగమణి దంపతులు హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో ఉంటున్నారు. 


ఎకరం భూమి రాసిచ్చినా అక్కమీద అనుమానం


కుటుంబం నుంచి నాలుగు ఎకరాల భూమిలో ఎకరం నాగమణికి వచ్చింది. అయితే ఎకరం భూమి తిరిగివ్వాలని, కులాంతర వివాహం చేసుకున్నావంటూ అక్కతో గొడవపడేవాడు పరమేశ్. ఆ భూమిని ఇటీవలే తమ్ముడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసింది చేసింది. భవిష్యత్తులో భూమి అడగనని హామీగా బాండు రాసివ్వాలని పరమేశ్ డిమాండ్‌ చేయగా అందుకు నాగమని అంగీకరించలేదు. ఆ కోపంతో పాటు ఇటీవల పరమేశ్ కు వివాహం నిశ్చయమైనా ఏదో కారణంతో రద్దు అయింది. అక్కనే కారణమని భావించి ఆమె స్కూటీపై వెళ్తుంటే మనవూరు సబ్‌స్టేషన్‌ వద్ద కారుతో ఢీకొట్టాడు. కిందపడిన నాగమణిపై కొడవలితో ముఖం, మెడ మీద దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో కానిస్టేబుల్ నాగమణి చనిపోయింది. తరువాత నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.



Also Read: Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి