Top 10 Headlines Today:


గీత కార్మికులకు బీమా 


మే డే సందర్భంగా నిన్న కార్మికులకు వెయ్యి జీతం పెంచుతూ శుభవార్త అందించిన తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలోనే రాష్ట్రంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో కల్లుగీత కార్మికులకు ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


జగన్ ఉత్తరాంధ్ర పర్యటన


సీఎం జగన్ బుధవారం విశాఖ, విజయనగరంలో పర్యటించి భోగాపురం ఎయిర్‌పోర్టు, టెక్‌పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


నేటి బంగారం ధరలు 


అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్ యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెద్దగా మారలేదు. మన దేశంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ, ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి రేట్లలో ఎలాంటి మార్పు లేదు. వెండి రేటు ₹ 100 పెరిగింది. మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


అలక వీడని బాలినేని 


వైఎస్ఆర్‌సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వివాదానికి ముగింపు లభించినట్లయింది. రీజినల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతల నుంచి వైదొలగాలని బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ాయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ఏడాది కావడంతో సొంత నియోజకవర్గం పై దృష్టి పెట్టాల్సి వస్తుందని అందుకే తాను రీజినల్ కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలిగానని స్పష్టం చేశారు.  రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల ఇతర కారణాలను కూడా సీఎం జగన్ కు బాలినేని వివరించారు.  ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి


వర్షాకాల'మే'


దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్‌ కర్ణాటక, మరాఠ్వాడా వరకు ద్రోణి కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.


జేడీకి జాతీయ అవార్డు 


సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. రాజేష్ టచ్ రివర్ డైరెక్షన్ లో వచ్చిన 'దహిణి ది విచ్'లో జేడీకి.. ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో ఆయనకు అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


మీ రాశి ఫలాలు చూసుకున్నారా


ఈ ఐదు రాశుల వారికి ఈరోజు శుభప్రదం. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడం సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉండవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి 


నీరాతో ఏంటి ప్రయోజనం 


నీరా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే నీరా కేఫ్ హైదరాబాదులో ప్రారంభంకానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 


గో ఫస్ట్‌ దివాలా


వాడియా గ్రూప్‌కు చెందిన గో ఫస్ట్‌ (Go First) ఎయిర్‌లైన్స్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛంద దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. ఇందుకోసం ఎన్‌సీఎల్‌టీని సంప్రదించింది. మరిన్ని వివరాలు మీ కోసం ఇక్కడే 


గుజరాత్‌కు షాక్


బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తమ బ్యాటర్లు విఫలమైన చోట ఢిల్లీ బౌలర్లు వీరోచితంగా పోరాడి ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచి గుజరాత్ కు షాకిచ్చారు. పూర్తి స్కోర్ వివరాలు ఇక్కడ