JD Chakravarthy : ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలకు, నటీనటులకు ప్రపంచస్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మొన్నటికి మొన్న దర్శకధీరుడు తన అసామాన్య టాలెంట్ తో రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' దేశ, విదేశాల్లోనూ భారతీయ సినిమా ఖ్యాతిని చాటింది. అంతే కాదు ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు 'ఆస్కార్' రావడం ప్రతీ భారతీయున్ని గర్వపడేలా చేసింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన 'బలగం' సినిమాకు కూడా ఎన్నో అవార్డు వచ్చాయి. ఇలా ఒక్కటేమిటి.. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా మన ఇండియన్ సీనియర్ హీరో జేడీ చక్రవర్తి కూడా అరుదైన అవార్డు దక్కించుకుని ఇంటర్నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.


తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి. వైవిధ్యమైన పాత్రల్లో నటించి విలక్షణమైన సినిమాలు చేసిన ఆయన.. హీరోగానే కాకుండా విలన్ రోల్ లోనూ ప్రేక్షకులను అలరించారు. గత కొద్ది కాలంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జేడీ చక్రవర్తికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడీ చక్రవర్తికి ఈ అవార్డు లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఆయన ఈ అవార్డును దక్కించుకున్నారు. 2022లో వచ్చిన 'దహిణి ది విచ్' అనే సినిమాలో జేడీ నటనకుగానూ ఉత్తమ సహాయ నటుడిగా ఈ అవార్డు లభించింది.


అంతర్జాతీయ స్థాయిలో 18 అవార్డులు


ఇంతకుముందు ఈ సినిమా  అంతర్జాతీయ స్థాయిలో పలు గౌరవాలు దక్కించుకుంది. ఆస్ట్రేలియా టైటాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌స్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డుని అందుకుంది. అంతే కాదు స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా నామినేట్ అయిన ఈ చిత్రం..  దాదాపు 18 అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.


రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించిన 'దహిణి ది విచ్' సినిమాలో జేడీ చక్రవర్తితోపాటు.. తనిష్ట ఛటర్జీ, శ్రుతి జయన్ కీలకపాత్రలలో నటించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాలో నటించిన జేడీ చక్రవర్తికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడన్న విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేసింది. దీంతో ఆయన ఫ్యాన్స్, సినీ ప్రేమికులు జేడీకి కంగ్రాజ్యులేషన్స్ చెబుతున్నారు.


కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'శివ' సినిమాతో జేడీ చక్రవర్తి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'వన్ బై టూ', 'మనీ మనీ', 'గులాబీ', సినిమాలతో కథానాయికుడిగా అలరించారు. 'మృగం', 'దెయ్యం', 'బొంబాయి ప్రియుడు', 'ఎగిరే పావురమా' సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన జేడీ.. చివరగా 2022లో 'కారీ' మూవీలో కనిపించారు. హిందీలో ఈ ఏడాదిలో వచ్చిన 'తాజా ఖబర్' అనే వెబ్ సీరీస్ లోనూ జేడీ చక్రవర్తి నటించారు. లోనే కాకుండా పలు చిత్రాల్లో నటించిన జేడీ.. చివరగా 2022లో 'కారీ' మూవీలో కనిపించారు.



Read Also: బెల్లంకొండ ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ రిలీజ్, మాస్ యాక్షన్ తో ఊచకోత!