తెలుగులో ప్రభాస్ హీరోగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలోకి రీమేక్ అవుతోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా  ట్రైలర్ ను విడుదల చేశారు.  






యాక్షన్ సీన్లతో దుమ్మురేపిన బెల్లంకొండ


ఈ ట్రైలర్ లో అదిరిపోయే యాక్షన్ సీన్లతో నిండిపోయింది. తెలుగులో ప్రభాస్ యాక్టింగ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బెల్లకొండ శ్రీనివాస్ కష్టపడ్డారు. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్  పవర్ ప్యాక్డ్ గా రూపొందింది. యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  ఫైటింగ్స్, యాక్షన్ లాంటి సన్నివేశాల్లో బెల్లంకొండ అదుర్స్ అనిపించాడు. ఈ ట్రైలర్ తో ‘ఛత్రపతి’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అదే తరహాలో బెల్లంకొండకు  హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.


'ఛత్రపతి'తో కోసం బాడీ షేప్ పూర్తిగా మార్చిన బెల్లంకొండ


ఇక హిందీలో 'ఛత్రపతి' కోసం బెల్లంకొండ తన బాడీ షేప్ ను పూర్తిగా మార్చేశారు. తెలుగులో ప్రభాస్ ఏ విధంగా అయితే కండలతో, ఫిట్ గా కనిపించాడో అదే తరహాలో పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు.  ఇక ఈ సినిమా టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయకముందే ‘దసరా’ మూవీ సందర్భంగా థియేటర్లలో ప్లే చేసిన యాడ్ స్పేస్ లో ఈ మూవీ టీజర్ ను ప్లే చేశారు. 



మే 12న 'ఛత్రపతి' విడుదల


18 ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'ఛత్రపతి' ఇప్పుడు హిందీలో రిమేక్ అవుతుండడంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో హిందీలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక, జాసన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను, పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్నారు .


హిందీలో ఓ రేంజిలో ఫాలోయింగ్


బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన హిందీ డబ్ సినిమాలకు మిలియన్ల వ్యూస్ వస్తాయి. అందుకే అతని సినిమాలు అన్నీ హిందీలో కూడా డబ్ చేస్తారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ సినిమాను కూడా హిందీలో డబ్ చేశారు. ఈ మూవీకి హిందీలో ఏకంగా 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 


Read Also: ‘విరూపాక్ష‘ హిందీ ట్రైలర్ చూశారా? రిలీజ్ ఈ వారమే!