తెలుగులో ఫిమేల్ లిరిసిస్టులు చాలా తక్కువ. ఉన్న కొద్దిమందిలో శ్రేష్ఠ (Lyricist Shreshta) ఒకరు. 'పెళ్లి చూపులు'లో 'చినుకు తాకే...', 'మెరిసే మెరిసే...' పాటలతో పాటు విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాలో 'మధురమే ఈ క్షణమే...', 'గుండెల్లోన...' పాటలు రాశారామె. 


శ్రేష్ఠ రాసిన పాటలు తక్కువే అయినప్పటికీ... అక్కినేని నాగ చైతన్య 'యుద్ధం శరణం', శర్వానంద్ 'కో అంటే కోటి', నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్', అఖిల్ అక్కినేని 'హలో' తదితర చిత్రాలకు పని చేశారు. ఇప్పుడు ఆమె చిత్రసీమ ప్రముఖులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకుంటే కారణం వాళ్ళేనంటూ శేఖర్ కమ్ముల, సుకుమార్, నందిని రెడ్డి సహా పలువురు ప్రముఖుల పేర్లను పేర్కొన్నారు (Lyricist Shreshta Shocking Allegations). 


ఫేస్ బుక్ లో శ్రేష్ఠ చేసిన పోస్టును యథాతథంగా ఇక్కడ మీకు అందిస్తున్నాం


''శ్రేష్ఠ ఆత్మహత్య చేసుకుని చనిపోకపోయినా...
ఏ అనుకోని ప్రమాదవశాత్తయినా శ్రేష్ఠకి జరగరానిది ఏదయినా జరిగితే...
ఒకవేళ శ్రేష్ఠ ఏ ప్రమాదంలో అయినా మరణిస్తే...


2013 నుండి 2016 వరకూ...
- కుమార్ నాగేంద్ర
- కుమార్ రాజ
- నందిని రెడ్డి
- లక్ష్మీ భూపాల్
- పింగళి చైతన్య
- శేఖర్ కమ్ముల
- కో అంటే కోటి , మైత్రి, జబర్దస్త్ సినిమాల టీమ్ కాల్ డేటాలు, వాట్సాప్ ఛాట్ లు పరిశీలించాలి!


శ్రేష్ఠని టార్గెట్ చేసిన సదరు వ్యక్తులు, ఆ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళూ ఎలా మైండ్ గేమ్స్ ఆడారూ... అతి ప్రమాదకరమైన మానవ అక్రమ రవాణా (human trafficking) లాంటి ఉచ్చుల్లోకి ఎవరెవరు, అసలు ఎందుకు ఎన్ని విధాల, ఎలా శ్రేష్ఠని లాగేందుకూ, కుదరకపోతే చంపేందుకూ, అందుకూ అవకాశం దొరకకపోతే తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చచ్చేందుకూ... ఎందరు ఎన్ని విధాలుగా శ్రేష్ఠని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారు? అన్న వాస్తవాలు బయటకు వస్తాయి!


ఇకపోతే... 2021 నుండి ప్రస్థుతం వరకు... 
టీవీ 5 మూర్తీ, వాడి చుట్టూ ఉంటే తొత్తులూ, అలాగే సినిమా అవకాశాలంటూ నన్ను నమ్మిస్తూ పొట్టకొడుతూ వస్తున్న ప్రతీ ఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాల్ డేటా ఆయా సమయాల్లో లాగితే? వీళ్ళందరి వ్యహం ఏమిటి? వీళ్ళు ఎలా శ్రేష్ఠ జీవితంతో, కెరీర్ తో చెలగాటమాడుతున్నారు? అన్న విషయం బయటపడుతుంది!


అసలు ఈ సినిమా రంగంలో అయినా, మీడియాలో అయినా ఎవరెవరు ఎందరు హ్యాకర్స్ ఉన్నారు? ఎవరెవరు డార్క్ వెబ్ యాక్సెస్ చేస్తున్నారు? ఒక్క శ్రేష్ఠని మాత్రమేనా? ఇంకా ఎందరెందరు అమాయకమైన ఆడపిల్లలను టార్గెట్ చేసి హ్యాక్ చేస్తున్నారు? అసలు ఆ హ్యాకర్స్ టార్గెట్ సదరు ఆడాళ్ళను హ్యాక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ లాగడం మాత్రమేనా? లేక హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ తో సంబంధాలు ఉన్నాయా? వంటి అంశాలు పరిశీలించాలి. 


ప్రత్యక్షంగానో పరోక్షంగానో పరిపరివిధాలా నాపై నా జీవితంపై, నా కెరీర్ పై దెబ్బ కొడుతూ, అలా దెబ్బ కొట్టేవాళ్ళకు ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్న నా జ్ఞాతా అజ్ఞాత శత్రువులూ... గతంలో నేను ఇండస్ట్రీ వదిలి, హైదరాబాద్ వదిలి కొన్నాళ్ళు ఆత్మరక్షణ కోసం ఇంటి దారి పట్టడానికి కారణమయిన వాళ్ళు... ప్రస్తుతం కూడా పరిపరివిధాలా నా వ్యక్తిగత, వృత్తిపర జీవితంపై ప్రత్యక్షంగా పరోక్షంగా దెబ్బలు కొట్టడమే కాక, హ్యాకింగ్, క్షుద్ర ప్రయోగాల పంజా నిగూఢంగా నాపై వేస్తూ వస్తున్న జ్ఞాత అజ్ఞాత శతృవులూ వాళ్ళకు సహకరిస్తూ వస్తున్నవాళ్ళ వివరాలు ఇవి


నా శతృవులూ నా శతృ గణానికి సంబంధించినవాళ్ళూ:
కొడవటిగంటి ఫణీంద్ర ప్రసాద్
శ్రవణ్ కుమార్
శివ చైతన్య
కుమార్ రాజా
యండమూరి వీరేంధ్రనాధ్
శేఖర్ కమ్ముల & team
నందినీ రెడ్డి & team
లక్ష్మీ భూపాల్
పింగళి చైతన్య
రామజోగయ్య శాస్త్రీ
సుకుమార్ & team
వెలిగొండ శ్రీనివాస్
మున్నా
మైత్రి ( నవదీప్, సదా మూవీ team)
కో అంటే కోటీ movie team
జబర్దస్త్ movie team
హైమారెడ్డీ
దామోదర్ రెడ్డీ
జీవన్ రెడ్డీ
సందీప్
గిరీ
రమణ మూర్తీ
లోక్నాథ్
వేణు స్వామి
జనహర్ష real estate కి సంబంధించిన ప్రతీ ఒక్కరూ
విజయ విహారం పత్రికకి సంబంధించిన ప్రతీ ఒక్కరూ
Tv5 మూర్తీ & అతని స్నేహితులూ సన్నీహితులూ అందరూ!


ఒక ఆడదాన్ని టార్గెట్ చేసి, ఐసొలేట్ చేసి, నానా రకాలుగా పీడించి చంపడం లేదా
తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చచ్చేలా చేయడం చాలా మందికి వెన్నతో పెట్టిన విద్య! వాళ్ళ పగకు పెద్ద కారణమేమీ ఉండదు. ఓ స్త్రీ కొద్దో గొప్పో సంస్కారంగా కనిపిస్తే చాలు, తన విలువలు కాపాడుకుంటూ బ్రతికే వ్యక్తిత్వంతో ఉంటే చాలు... బస్ అంతే!


ఎలా చెడగొట్టాలి? ఎలా చెరచాలి? ఎంతకీ వాళ్ళ పన్నాగాలు ఫలించకపోతే...
ఎలా చంపాలి? ఎలా చచ్చేలా చేయాలి? అంతే! ఆట... ఆడాళ్ళ జీవితాలతో చెలగాటాలాడే ఆట!


అబ్బే అదేదో మగాళ్ళు మాత్రమే ఆడే ఆట అనుకుంటే పొరపాటే సుమా! ఆడదానికి ఆడదే శతృవూ! హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియాతో బలంగా సంబంధాలుండేదీ ఆడాళ్ళకే! ఆ వ్యభిచారంలో ఆరితేరి మేక వన్నె పులుల్లా అమాయకమైన ఆడపిల్లకి వలలేసే బ్రోకర్లుగా ఉండేదీ ఎక్కువగా ఆడాళ్ళే!


మగాళ్ళూ ఎక్కువగా అమ్మాయిలని హ్యాక్ చేస్తూ, వాళ్ళ జీవితాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఆడుకుంటూ ఉంటే... నేరుగా వాళ్ళపై పంజా వేయాలని చూసేదీ ఆడాళ్ళే!


ఇదీ నా అనుభవం అర్థంచేపించిన నిజం!''


Also Read ఉత్తమ రౌడీ కాదు, ఉత్తమ వెన్నుపోటు దారుడు, గురికాడు అవార్డులు ఇవ్వాలి... అశ్వినీదత్ వ్యాఖ్యలపై పోసాని కౌంటర్ ఎటాక్


ఫేస్‌బుక్‌లో తన స్నేహితులు మాత్రమే చూసేలా శ్రేష్ఠ ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి వంటి స్త్రీవాదుల పేర్లు రాయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శ్రేష్ఠ ఆరోపణలపై సోషల్ మీడియా, ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.


Also Read  ఎన్టీఆర్ 30లో 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ హీరోయిన్ చైత్ర - రోల్ ఏంటంటే?