YSRCP News : వైఎస్ఆర్‌సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వివాదానికి ముగింపు లభించినట్లయింది. రీజినల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతల నుంచి వైదొలగాలని బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ాయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ఏడాది కావడంతో సొంత నియోజకవర్గం పై దృష్టి పెట్టాల్సి వస్తుందని అందుకే తాను రీజినల్ కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలిగానని స్పష్టం చేశారు. రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల ఇతర కారణాలను కూడా సీఎం జగన్ కు బాలినేని వివరించారు. ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రోటోకాల్ ఇష్యూనూ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన బాలినేని
అదే సమయంలో జిల్లాలో జిల్లాలో ప్రోటోకాల్ ఇష్యూ ను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లాలో బాలినేని గౌరవానికి భంగం కలగకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చారు. సీనియర్ నేతగా జిల్లాలో ఇతర నియోజకవర్గాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు. సమస్యలున్న నియోజకవర్గాల నాయకులను సమన్వయం చేయాలని సూచించినట్లుాగ తెలుస్తోంది. ముఖ్యమంత్రి మాటలను బట్టి ప్రకాశం జిల్లా బాధ్యతలను సీఎం జగన్ ... బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి ఆధిపత్యం ఉంది. ఆయన చెప్పిన మాటనే అందరూ వింటున్నారు. అదే సమయంలో మరో మంత్రి ఆదిమూలం సురేష్ కూడా పెత్తనం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో సమస్యలు ఉన్న నియోజకవర్గాల్లో సమన్వయం చేయాలన్న సీఎం జగన్
ఇప్పుడు తాను నియోజకవర్గాల్లో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే వీరు ఊరుకోరని.. అధికారులు కూడా సహకరించరని బాలినేని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇతర నేతల్ని కట్టడి చేసితనకు అధికారం ఇస్తే సమన్వయం చేసుకుంటాననని బాలినేని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతున్నట్లు కనిపించడంతోనే సీఎం జగన్ పిలిచారని ఆయన వర్గీయులుభావిస్తున్నారు.
బాలినేని చల్లబడినట్లేనా ?
మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో అలిగిన బాలినేనిని పార్టీ పెద్దలు సముదాయించి సీఎం జగన్‌తో మాట్లాడించి శాంతింపజేశారు. ఇప్పుడు ఆయన తన ప్రాంతీయ సమన్వయకర్త పదవికి అనూహ్యంగా రాజీనామా చేసి మరోమారు వార్తల్లోకెక్కారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల్లో ఆయనకు మంచిపట్టు ఉంది. దీంతో ఆయన్ను బుజ్జగించి శాంతింపజేసేందుకు అధిష్టాన పెద్దలు రంగంలోకి దిగారు. పార్టీ తరపునుండి ఇద్దరు పెద్దలు ఆయనతో మంతనాలు జరిపారు. రీజినల్ కోఆర్డినేటర్‌గా కొనసాగేందుకు విముఖత చూపారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరం కావటం లేదని.. కేవలం రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుండి మాత్రమే తప్పుకుంటున్నట్లు బాలినేని పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు.