KTR :  వడగండ్ల వానలతో పంట నష్ట పోయిన రైతులందరికీ ఎకరాకు 10 వేల రూపాయలు,హెక్టారుకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి రైతులను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.వడగండ్ల వర్షాలకు ఎల్లారెడ్డి పేట మండలంలోని గుంట పల్లి చెరువు గ్రామంలో దెబ్బ తిన్న పంటలను మంత్రి పరిశీలించారు. రైతులు ఎవ్వరూ అదైర్య పడవద్దని ,పంట నష్టం జరిగిన వారందరికీ ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.మండలంలో 133 ఎకరాలలో వరి పంట కు నష్టం వాటిల్లిందని వ్యవసాయ,రైతుభందు అధికారుల అంచనా వేశారని తెలిపినట్లు కేసీఆర్ ప్రకటించారు.                   


ప్రతి ఎకరాకు 10 వేల రూపాయలు,హెక్టారుకి 25 వేల రూపాయల పంట నష్టం ప్రభుత్వం ద్వారా అందిస్తామని ,రైతులు ఎవరు ఏ అధికారి వద్దకు వెళ్లకుండా అధికారులే రైతుల ఇళ్ల‌ వద్దకు వచ్చి పంట నష్టం పరిహారం సొమ్ము అందిస్తారని కేటీఆర్ తెలిపారు.ఎండాకాలంలో ఇలా వర్షాలు పడుతాయని ఎవరు అనుకోలేదని, ప్రకృతి పగ బట్టి నట్లయిందని మంత్రి ఆవేదన చెందారు. చెడ గొట్టు వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని దైర్యంగా వుండాలని మీకు మేమున్నాం అని మంత్రి భరోసా కల్పించారు. రైతులను ఆదుకోవాలని సిఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు.                                 


సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా పోడు భూముల ను క్రమ బద్దికరించే ఫైల్ పైనే సి ఎం కేసీఅర్ తొలి సంతకం చేశార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.మనది రైతు ప్రభుత్వం అని రైతుల ను ఆదుకోవడానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు.గుంట పల్లి చెరువు తండా,వీర్ణప ల్లి,గజసింగవరం, గొరంటా ల గ్రామాలలో వడ గండ్లు పడి వరి పంట కు తీవ్రంగా నష్టం జరిగినట్లు తెలిసింది అని,పశువులకు మేతకు తప్ప వరీ పంట దేనికి పనికి రాకుండా పోవడం బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు.పోడు రైతులకు,కౌలు రైతులకు కూడా పంట నష్టం అందేలా చూస్తామని ,ఆ రైతుల వివరాలతో నివేదిక తయారు చేయాలని జిల్లా వ్యవసాయ,రెవిన్యూ ,అధికారులను మంత్రి ఆదేశించారు.                   

               


మరో వైపు జిల్లాల మంత్రులంతా విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రైతులకు  భరోసా ఇస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తామని ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు.వరుసగా పడుతున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది.