Morning Top News: 


 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్


ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక కొత్త  ప్రయోగాన్ని చేపడుతోంది.  జిల్లా రోడ్లకు సైతం టోల్ టాక్స్ వర్తింపజేయాలనే ఆలోచన. ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 18 bబ రోడ్లను ఎంపిక చేసి టోల్ టాక్స్ ఆచరణలో పెట్టబోతుంది.  18 ఆర్‌ అండ్‌ బీ రహదార్లును గుర్తించినప్పటికీ ముందుగా ఈ ప్రయోగాన్ని గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఆమదాలవలస వైసీపీలో ముసలం


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించడం కొందరికి ఇబ్బందిగా మారింది. మొన్నటి వరకూ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ శాససభాపతి తమ్మినేని సీతారాంను మార్చి యువకుడైన రవికుమార్‌కి అవకాశాన్ని జగన్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో తమ్మినేని సీతారాం తీవ్ర నిరాశకి లోనయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


జగన్ కు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ 


చిన్న పిల్లలకు అందించే చిక్కీల్లో సైతం డబ్బులు కాజేసిన  వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్న జగన్ విమర్శలపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


 టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. వాటిని నిషేధించాలని అన్నారు. మైనర్లు, డ్రైవర్లు మద్యం మత్తులోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అయితే వాటిపై అధికారులు కన్నెతి చూడడం లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


టెక్కలి పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి


 దివ్వెల మాధురి మరోసారి పోలీసులను ఆశ్రయించారు . వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌‌పై, తనపై.. జనసేన నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టెక్కలి పోలీసులకు ఆమె స్థానిక నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్


ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 2 నుంచి 28 వరకూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబర్ 2 నుంచి 28 వరకూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 విద్యార్ధినులకు కౌన్సెలింగ్ లో బట్టబయలైన టీచర్ నిర్వాకం


ఒక పాఠశాలలో నిర్వహించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన విద్యారధీనులు ఒక కీలక విషయాన్ని మహిళా పోలీసుతో పంచుకున్నారు. మ్యాథ్స్ టీచర్ తమపై   చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 6వ తరగతి విద్యార్థినులు మహిళా పోలీసుకు విషయం చెప్పగా కీచక ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లి మరీ దేహశుద్ధి చేశారు. పోలీసులు టీచర్‌ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


కిస్సిక్ తుస్.. ఊ అంటావా కే నెటిజన్ల ఓటు

పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిస్సిక్ విడుదలకు ముందు నుంచి ఎలా ఉంటుంది? ఊ అంటావా...‌ పాటను బీట్ చేస్తుందా? సమంతను మరిపించేలా శ్రీ లీల స్టెప్పులు వేస్తుందా? లేదా? అని ప్రేక్షకులలో చర్చ మొదలైంది. ఇప్పుడు శ్రీ లీల పాట విడుదల అయింది. ఆ వెంటనే అనుకున్నంత ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  కిస్సిక్ బావుంది కానీ... ఊ అంటావా అంత‌ లేదని కామెంట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


 విరాట్ కోహ్లీ శతక గర్జన-ఇన్నింగ్స్ డిక్లేర్


పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్  గట్టి  ఆధిక్యంలోకి వెళ్లింది.   రెండో ఇన్నింగ్స్ ను 487/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆస్ట్రేలియా విజయానికి  534 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ కొండంత లక్ష్యాన్ని ఛేదించడం ఆస్ట్రేలియా జట్టుకు అంత ఈజీ కాదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 12 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



 భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు


ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రోజులో ప్రాంఛైజీలు మన భారతీయ ఆటగాళ్ళపై కోట్లు కుమ్మరించారు.  ఊహించినట్లుగానే రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గత రికార్డులన్నీ కాలగర్భంలో కలిపేశాడు. పంత్, అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ కోసం ప్రాంచైజీలు పోటీ పడ్డాయి.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..