Indian Army Recruitment Ralley: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్ తెలిపింది. పదోతరగతి ఉత్తీర్ణులైన యువకులకు డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నియామక ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ ట్రేడ్‌లలో నియామకాలు చేపట్టనున్నారు.
ఎవరు అర్హులు?
తెలంగాణ పరిధిలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకావచ్చు.
అర్హతలు..
అగ్నివీర్ జనరల్ డూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ అగ్నివీర్ ట్రెడ్స్ మెన్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉతీర్ణత ఉంటే సరిపోతుంది.
అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీస్ (WMP) అభ్యర్థులకు ఫిబ్రవరి 12న విడుదలైన ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం.. ర్యాలీ జరిగే చోటుకి అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని బోర్డు సూచించింది. నియామక ప్రక్రియ పూర్తిగా అటోమేటేడ్, ఫెయిర్, పారదర్శకంగా ఉంటుందని, ఎవరైనా అర్హత సాధించడానికి లేదా నమోదు చేసుకోవడానికి సహాయం చేయగలమని క్లెయిమ్ చేసే మోసపూరిత ట్వీట్లు / మోసగాళ్ల నుంచి అభ్యర్థులు జాగ్రత్త వహించాలని కోరారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే రిక్రూట్ మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్: 040-27740059, 27740205 ద్వారా పరిష్కరించుకోవచ్చు.
ALSO READ:
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!