News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

30 వచ్చేసింది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం లేనట్టేనా! షర్మిల నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?

సెప్టెంబరు 30 రానే వచ్చింది. అనుకున్న డెడ్ లైన్ కూడా నేటితో ముగిసిపోనుంది. ఆ పార్టీ మాత్రం విలీనం కాలేదు. ఇంతకీ ఏ పార్టీ అని అనుకుంటున్నారా ? షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ.

FOLLOW US: 
Share:

సెప్టెంబరు 30 రానే వచ్చింది. అనుకున్న డెడ్ లైన్ కూడా నేటితో ముగిసిపోనుంది. ఆ పార్టీ మాత్రం విలీనం కాలేదు. ఇంతకీ ఏ పార్టీ అని అనుకుంటున్నారా ? షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ టీపీ. ఈ నెల 30లోపు  వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ విలీనం చేయడంపై క్లారిటీ ఇస్తానని అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. అమె చెప్పిన గడువు వచ్చేసినా పార్టీ విలీనంపై ఉలుకుపలుకు లేకపోవడంతో, కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్ టీపీ విలీనం లేనట్టేనని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పట్లో విలీనం ఉండదని పార్టీ అభిమానులు, కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 

షర్మిల పార్టీని కాంగ్రెస్ లైట్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు పార్టీ విలీనం చేసేందుకు షర్మిల ఢిల్లీ వయా కర్ణాటకకు చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయ సమాచారం. మొన్నటి వరకు ఇదిగో విలీనం.. అదిగో విలీనం అని లీకులిచ్చిన నేతలు ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం విలీనంపై అడిగితే మాట దాటవేస్తున్నారు. షర్మిల వన్ మ్యాన్ షో తప్పితే బలమైన క్యాడర్ లేకపోవడం కూడా మైనస్ అయిందని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరుదామనుకుంటున్న షర్మిలకు హస్తం పార్టీ నుంచి వ్యతిరేకత ఎక్కువైంది. షర్మిల వర్సెస్ రేవంత్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరు వర్గాలకు ఏమాత్రం పొసగడం లేదు. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టమని స్థానిక నేతలు ఎన్నో రోజులుగా అడ్డుకుంటున్నారు. షర్మిల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుతుందనే విషయంలో రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పలు నివేదికలు కూడా పంపించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల గతంలో ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో షర్మిల పార్టీ విలీనానికి బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. 

పార్టీ విలీనంపై ఈ నెల 30లోపు నిర్ణయం తీసుకుంటామని వైఎస్‌ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...ఐదు రోజుల క్రితం ప్రకటించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. పార్టీ విలీనం, ఎన్నికల వ్యుహంపై 33 జిల్లాల నేతలతో ప్రధానంగా చర్చించారు. రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్​టీపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని షర్మిల తెలిపారు.  అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కేసీఆర్ అవినీతి పాలను అంతమొందించేందుకు హస్తం పార్టీతో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన ప్రతి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పార్టీ విలీనంపై చర్చలు తుది దశకొచ్చాయని తెలిపారు. తన తండ్రిపై వారికి గౌరవముందని నిర్ధారించుకున్న తర్వాతే సోనియా, రాహుల్​తో చర్చల వరకు వెళ్లినట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు.

పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏళ్ల తర్వాత  కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. వైఎస్సార్ పేరు నాడు సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చటం కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదని వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్ తో జరిగిన సమావేశంలో అంశాలను వెల్లడించారు. వైఎస్ కుటుంబంపై వారి మాటల్లో గౌరవం కనిపించందన్నారు. వైఎస్సార్ లేని లోటు కనిపిస్తోందని రాహుల్ చెప్పారని షర్మిల వివరించారు. వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామని, సోనియా, రాహుల్ గాంధీ అంటున్నారని షర్మిల తెలిపారు. 

Published at : 30 Sep 2023 11:44 AM (IST) Tags: YS Sharmila Telangana YSRTP Merge in Congress

ఇవి కూడా చూడండి

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

TS LAWCET: టీఎస్‌ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Minister Komatireddy: ఆర్&బీ మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు - మాజీ మంత్రి హరీశ్ రావుకు కౌంటర్

Minister Komatireddy: ఆర్&బీ మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు - మాజీ మంత్రి హరీశ్ రావుకు కౌంటర్

Sirpur Kagaznagar Train: సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం - కోచ్‌ నుంచి పొగలు

Sirpur Kagaznagar Train: సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం - కోచ్‌ నుంచి పొగలు

టాప్ స్టోరీస్

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!

ఛత్తీస్‌గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!