Breaking News Live Telugu Updates: ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు : సీఎం కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన కాలనీలు : సీఎం కేసీఆర్
శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం :
తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించిన సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ప్రధాన రహదాలు మునక, రాకపోకలకు అంతరాయం
కోనసీమలో లంకలను దాటి ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు
పి.గన్నవరంలోని నాగుల్లంక వద్ద రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
10 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు
పి.గన్నవరం నుండి రాజోలు వెళ్ళే ప్రధాన రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న నీరు
పి.గన్నవరం నుండి రాజోలు, రావులపాలెం వెళ్ళే రహదారిపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు..
ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరిన సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. అక్కడ వరద ప్రవాహం తగ్గాలని, శాంతించవమ్మా అంటూ గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గోదావరి బ్రిడ్జిని సైతం కేసీఆర్ పరిశీలించారు.
తెలంగాణ ఏర్పాటైన తరువాతే బోనాల పండుగ ఘనంగా జరువుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఉజ్జయినీ అమ్మవారి బోనాలను మంత్రి తలసాని చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఆలయంతోపాటు ఆలయ పరిసరాలను కూడా చాలా అందంగా తీర్చిదిద్దారని.. ఆలయాలు, మసీదులు, చర్చీలను సైతం సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారని చెప్పారు. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున 4.00 గంటలకు అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మంత్రి తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి బోనం సమర్పణతో జాతర ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు మహాంకాళి అమ్మవారి ఆలయంలో బారులు తీరారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్బంగా MLC కల్వకుంట్ల కవిత సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుండి 2 వేల మంది మహిళలు బోనాలతో వెంట రాగా బంగారు బోనంతో బయలు దేరి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
10.00 గంటల నుండి 11.00 గంటల వరకు skt పంక్షన్ హాల్ పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో గవర్నర్ తమిళిసై మాటా మంతి కార్యక్రమం .
అనంతరం మందులు పంపిణీ కార్య క్రమం లో పాల్గొంటారు.
11.00 గంటలకు sky పంక్షన్ హాల్ నుండి బయలుదేరి 11 .10 గంటలకు భారాజల కర్మాగారం గెస్ట్ హౌస్ చేరు కుంటారు.
అనంతరం 11.30 వరకు బ్రేక్ పాస్ట్ చేస్తారు.
11.30 గంటలకు గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి 12.00 గంటలకు అశ్వాపురం లోని చింతిర్యాల గ్రామం చేరుకుంటారు.
మద్యహానం 1.00 గంట వరకు చింతిర్యాల గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమ లో పాల్గొంటారు.
1.00 గంటకు చింతిర్యాల గ్రామంలో బయలుదేరి 1.30 భారాజల కర్మగారము కాలనీ తరంగిని పంక్షన్ హాల్ కు చేరు కుంటారు.
1.30 గంటల నుండి 2.30 వరకు ముంపు గ్రామాల ప్రజలు తో మాట్లాడుతారు.
2.30 గంటలకు తరంగిని పంక్షన్ హాల్ నుండి బయలుదేరి 2.40 గంటలకు భారాజలకర్మగారం గెస్ట్ హౌస్ చేరుకుంయారు.
2.40 గంటల నుండి 3.20 గంటల వరకు లంచు లో పాల్గొంటారు.
3.20 గంటల నుండి 5.00 గంటల వరకు కేంద్ర హోంమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.
సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు విశ్రాంతి మరియు డిన్నర్ లో పాల్గొంటారు.
అనంతరం మణుగూరు రైల్వేస్టేషన్ స్టేషన్ కు బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటారు.
అశ్వాపురం గౌతమి నగర్ పునరావస కేంద్రంలో బాధితులతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై ముఖాముఖి
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దుచేసిన నేపథ్యంలో బాధిత ప్రజలకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతున్నది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ తో సహా ప్రయాణిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం భద్రాచలానికి చేరుకోనున్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను సిఎం కెసిఆర్ పరిశీలించనున్నారు.
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు హౌస్ అరెస్ట్ అయ్యారు. రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన ఘటనపై టీడీపీ నిజనిర్థారణ కమిటీ ఏర్పాటు చేసింది. బాపట్ల జిల్లా,రేపల్లె నియోజకవర్గం, పోటుమెరకగ్రామంలో కల్తీ మద్యం తాగి గరికపాటి నాంచారయ్య, రేపల్లె రత్తయ్య మృతి చెందిన ఘటనపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ రేపల్లె మండలంలోని మోటుమెరకు గ్రామంలో బాధిత కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించటానికి వెళ్తున్నారు. ఈరోజు పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
- తెల్లవారు జామున ఘటన కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
- భార్యను హతమార్చిన భర్త, సంజయ్ నగర్ జియాగూడలో ఘటన.
- మృతురాలు సరిత యాదవ్ (26)
- టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్న ఆమె భర్త సంతోష్ సరితను ప్రైవేట్ పార్ట్ లో కత్తితో పొడిచి హత్య
- సంతోష్ తన భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల అనుమానం
- అడ్డువచ్చిన మృతురాలు బంధువుపై కత్తితో దాడి
- గాయపడ్డ వ్యక్తి ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
- సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్
- మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి
- పోలీసుల అదుపులో నిందితుడు సంతోష్
- బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్యగా కేసు నమోదు
ముఖ్యమంత్రి కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందుకోసం సీఎం హన్మకొండ నుంచి కాసేపటి క్రితం ఏటూరు నాగారం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో కేసీఆర్ రోడ్డు మార్గంలో ఏటూరునాగారం వెళ్తున్నారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.
- శంషాబాద్ తుక్కుగూడ లో కాల్పుల కలకలం
- ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ పైకి గన్ తో కాల్పులు
- గురి తప్పడంతో ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్
- లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ లో వచ్చిన వ్యక్తి
- ఐరన్ లోడ్ లారీ దొంగతనం చేయడానికి ప్రయత్నించారా? అనే అనుమానాలు
- దారి దోపిడీ దొంగల పనా లేదా గతంలో ఏదైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ
- లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
- కాల్పులు జరిపిన స్విఫ్ట్ కార్ వ్యక్తి పరారీ
Background
వారం రోజులు కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఏపీ, తెలంగాణలో రాజమండ్రి, ధవళేశ్వరం, భద్రాచలం వద్ద గోదావరి గరిష్ట నీటి మట్టాన్ని తాకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లోని అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అనుబంధ ఉపరితల ఆవర్తనంగా మారింది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు బలమైన అల్పపీడన ప్రాంతం కేంద్రం గుండా వెళుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ, యానాంలో నేడు సైతం వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా, సౌరాష్ట్ర , కచ్, ఉదయపూర్, రైసెస్ తీర ప్రాంతాలు, జబల్ పూర్, పెంద్రా రోడ్, హీరాకుడ్, కోస్తా ఒడిశా మీదుగా అల్పపీడన కేంద్రం, తీర ప్రాంత ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో.. అక్కడి నుంచి ఆగ్రేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర భారత ద్వీపకల్పమైన 19 డిగ్రీ ఉత్తర అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 7.6 కి.మీ మధ్య సుమారు 18 డిగ్రీల తూర్పు పశ్చిమ షియర్ జోన్ తక్కువగా గుర్తించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడతాయి. వరద నీటితో గోదావరి ప్రాంతాలు చాలా వరకు నీట మునిగాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం తక్కువగానే ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. సీమ జిల్లాలైన చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.. వర్షాలు, వరద ప్రవాహం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగుల దిగువకు చేరుకుందని వాతావరణ శాఖ తెలిపింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
- - - - - - - - - Advertisement - - - - - - - - -