Sankrantiki Vastunnam Trailer Launched: 2025 సంక్రాంతి రేసులో ఉన్న ఫ్యామిలీ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki Vastunnam). విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా, 100 స్ట్రైక్ రేట్ ఉన్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఎక్స్/ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.
పాటలు సూపర్ హిట్...
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల అయిన పాటలు అన్నీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ‘గోదారి గట్టు’, ‘మీను’, ‘బ్లాక్‌బస్టర్ సంక్రాంతి’ ఇలా వచ్చిన మూడు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వీటిలో ‘గోదారి గట్టు’ పాటను ఎన్నో సంవత్సరాల తర్వాత రమణ గోగుల పాడారు. ఈ పాటకు యూట్యూబ్‌లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే ‘మీను’ సాంగ్ 17 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇక బ్లాక్‌బస్టర్ సంక్రాంతి పాటను హీరో వెంకటేష్ స్వయంగా పాడటం విశేషం. ఈ పాట ప్రస్తుతం 11 మిలియన్ల వరకు వచ్చింది.
టీజర్ లేకుండానే...
ఇటీవలి కాలంలో సినిమా ప్రమోషన్లను గ్లింప్స్, టీజర్‌లతో ప్రారంభించి రిలీజ్ దగ్గర పడేసరికి పాటలు విడుదల చేస్తున్నారు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఫార్మాట్‌ను అస్సలు ఫాలో అవ్వలేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్, టీజర్ ఏవీ రిలీజ్ కాలేదు. నేరుగా పాటలతోనే ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. కానీ ప్రతి పాట రిలీజ్‌కు ముందు ప్రోమోతో ఆసక్తి పెంచేశారు. దీంతో పాటలు విడుదల అవ్వడానికి ముందే ఆడియన్స్‌లో ఇంట్రస్ట్ క్రియేట్ చేశాయి.
Also Read: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్...
ఇటీవలి కాలంలో సినిమాలు అన్నీ సంవత్సరాల తరబడి షూటింగ్ జరుపుకుంటున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో కూడా ‘గేమ్ ఛేంజర్’ దాదాపు మూడేళ్ల వరకు నిర్మాణంలో ఉంది. బాలకృష్ణ ‘డాకూ మహరాజ్’ షూటింగ్ కూడా 2023లోనే ప్రారంభం అయింది. కానీ నందమూరి బాలకృష్ణ పొలిటికల్ కమిట్‌మెంట్స్ కారణంగా మధ్యలో మూడు నెలలు షూటింగ్‌కు బ్రేక్ పడింది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ షూటింగ్ మాత్రం సూపర్ ఫాస్ట్‌గా పూర్తి అయిపోయింది. కేవలం 72 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల హిట్ల మీద హిట్లు ఇస్తున్న భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ బాధ్యతలను సమీర్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తున్నారు. ఉపేంద్ర, నరేష్, వీటీవీ గణేష్, సాయి కుమార్, మురళీధర్ గౌడ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.