Hero Vishal Health: హీరో విశాల్ హెల్త్‌పై అధికారికంగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. హెల్త్ బులిటెన్ విడుదల చేసేంతగా విశాల్‌కు ఏమై ఉంటుందా? అని అంతా అనుకుంటున్నారా? ఆదివారం ఆయన నటిస్తోన్న ‘మదగజరాజ’ సినిమా మీడియా సమావేశంలో విశాల్‌ని చూసిన వారంతా ఆందోళన చెందారు. అందుకు కారణం.. అసలు విశాలేనా? అన్నంతగా ఆయన మారిపోయాడు. మైక్ పట్టుకుని మాట్లాడలేని పరిస్థితి. గజగజ వణికిపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. దీంతో విశాల్‌కి ఏదో అయ్యిందని ఆయన ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. 


వాస్తవానికి విశాల్ ఫాదర్ ఫుల్ ఫిట్‌నెస్‌తో ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటిది ఆయన కుమారుడు ఒక్కసారిగా ఇలా మారిపోవడం ఏమిటనేలా, ఆయన ఫోటోలు, వాటిపై వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన పీఆర్ టీమ్ అధికారికంగా విశాల్‌కు ఏమైందో తెలుపుతూ, ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ఇచ్చిన ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.


Also Read: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు


ఈ హెల్త్ బులిటెన్ ప్రకారం.. విశాల్ కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు వెంటనే బెడ్ రెస్ట్ అవసరం అంటూ అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఇదే, హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విశాల్ పీఆర్ టీమ్.. అభిమానులెవరూ భయాందోళనకు గురికావద్దని తెలుపుతూ, త్వరలోనే విశాల్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వస్తారని ప్రకటించారు. ఇక ఈ బులిటెన్ చూసిన విశాల్ అభిమానులు కూడా.. గెట్ వెల్ సూన్ సార్ అంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు పంపుతున్నారు. అదీ, విశాల్ హెల్త్‌కు సంబంధించిన విషయం.






ఇక ఆయన నటించిన ‘మదగజరాజ’ సినిమా ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం విడుదల కావాల్సిన సినిమా. ఇందులో తెలుగమ్మాయి అంజలి, తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్.. విశాల్ సరసన నటించారు. సుందర్ సి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోయింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో విశాల్‌కు, వరలక్ష్మీ శరత్ కుమార్‌ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఈ సినిమా విడుదల లోపు పెళ్లి అనేలా వార్తలు రాగా, అనూహ్యంగా వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ.. పీటల వరకు వెళ్లే పరిస్థితుల్లో వీరి పెళ్లి ఆగిపోయింది.


Also Read: ‘గేమ్ చేంజర్’తో నాకు నేషనల్ అవార్డ్ వస్తుందని భావిస్తున్నా.. వారి నోట అదే మాట: అంజలి


ఆ తర్వాత ఎవరి సినిమాలు వారు చేసుకుంటూ.. బిజీ అయిపోయారు. ఇటీవల వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లి చేసుకుని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. విశాల్ మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నారు. ఆ మధ్య పెద్దలందరి సమక్షంలో ఓ అమ్మాయితో నిశ్చితార్థం అయితే అయింది కానీ.. పెళ్లి మాత్రం కాలేదు. కారణం ఏంటనేది తెలియరాలేదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత విశాల్, వరూల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మదగజరాజ’ విడుదలవుతుండటంతో.. కోలీవుడ్ ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఇందులో విశాల్, వరలక్ష్మీ శరత్ కుమార్ మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని టాక్.