Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!

Canadian PM: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి, పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పదేళ్ల అధికారానికి స్వస్తి పలికినట్లయింది.

Continues below advertisement

Justin Trudeau To Stpdown As liberal Party Leader: కొద్ది గంటల ఊహాగానాల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) లిబరల్ పార్టీ (Liberal Party) నాయకత్వానికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు తన పదవికి, లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకూ ఆయన ప్రధానిగా కొనసాగుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత బాధ్యతల నుంచి వైదొలుగుతానని ట్రూడో చెప్పారు. ఆయన రాజీనామాతో దాదాపు 10 ఏళ్ల అధికారానికి ముగింపు పలికినట్లవుతుంది. కాగా.. దేశవ్యాప్తంగా ట్రూడోపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోవడంతో.. లిబరల్ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో సొంత పార్టీ నేతల నుంచి కొంతకాలంగా డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు.

Continues below advertisement

Also Read: Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం

Continues below advertisement