Hair transplant capital of the world: ఇప్పుడు మగవాళ్లను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. జుట్టు రాలిపోవడం. మళ్లీ వస్తే సమస్య ఉండదు .. కానీ రావడం లేదు. జుట్టు మెలిపిస్తాం అని చెప్పి ఏవేవో కబుర్లు చెప్పి డబ్బులు కొట్టేసే వాళ్లు చాలా మందిని నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి వారందరికీ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పెద్ద రిలీఫ్. నెత్తి మీద జుట్టును పర్మినెంట్ మెలిపించే ప్లాంటేషన్. ఇప్పుడీ రంగంలో టర్కీ వరల్డ్ లీడర్ గా మారింది. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం టర్కీకి వెళ్లే వారి సంఖ్య ఊహించనంతగా పెరుగుతోంది.
జుట్టు మెలిపించుకుంటున్న సెలబ్రిటీలు
మన కళ్ల ముందు బట్టతలతో కనిపించిన చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఇప్పుడు తల నిండా జుట్టుతో కనిపిస్తూ ఉంటారు. వారంతా విగ్గులు పెట్టుకుంటారని అనుకుంటూ ఉంటారు. నిజానికి వారు విగ్గులు అనే తాత్కలిక సర్దుబాటును మర్చిపోయి టర్కీకి వెళ్లి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని వచ్చారు. అందుకే వారి జుట్టు ఒరిజినల్ లాగే కనిపిస్తుంది.
హెయిర్ ప్లాంటేషన్ లో వరల్డ్ లీడర్ గా టర్కీ
ఇప్పుడు బాగా డబ్బులు ఉండి.. జుట్టు ఊడిపోయిన వారంతా చలో టర్కీ అంటున్నారు. కాస్త కుబేరులు కాకపోయినా మధ్యతరగతి వాళ్లు కూడా అదే పని చేస్తున్నారు. ఎందుకంటే టర్కీలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఖర్చు చాలా తక్కువ. ఇటీవలి కాలంలో టర్కీకి హెయిర్ ట్రాన్స్ ప్రాలంటేషన్ టూరిజం పెరిగిపోయింది. వేల మంది వెళ్తున్నారు. ప్రస్తుతం టర్కీలో కేవలం ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఇండస్ట్రీ మూడు బిలియన్ల మార్కెట్ కైవసం చేసుకుంది. అత్యంత ఆధునికమైన ట్రాన్స్ ప్లాంటేషన్ సౌకర్యాలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అతి తక్కువకు సేవలు అందిస్తూండటంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టర్కీ వైపు ఆకర్షితులవుతున్నారు.
హెయిర్ ప్లాంటేషన్ టూరిజం
సాధారణంగా ఓ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు యూకేలో పదిహేను వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ సహా ఇతర ఏ దేశంలో అయినా కనీసం పన్నెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే టర్కీలో అయితే మొత్తంగా నాలుగువేల డాలర్లతో పని పూర్తయిపోతుంది. అమెరికా, యూరప్ ల కన్నా అత్యాధునిక టెక్నాలజీ వాడతారు. ఈ క్లీనిక్‌లు కూడా వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో ఉంటాయి. మంచి హెల్త్ కేర్ సిస్టమ్, మంచి హెల్తీ కాంపిటీషన్ ఉండచం కూడా ఓ కారణం. అందుకే సెలబ్రిటీలు సహా సామాన్యులు కూడా చలో టర్కీ అంటున్నారు.
టర్కిష్ హెయిర్ లైన్స్
రెండు రకాలుగా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలు జరుగుతున్నాయి. ఇప్పుడు టర్కీ వీధుల్లోఎక్కడ చూసినా ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్స చేయించుకుంటున్న వాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విమానాల్లో వచ్చిపోయే వాళ్లు కూడా అలాంటివాళ్లే. అందుకే టర్కిష్ ఎయిర్ లైన్స్ కాదు.. టర్కిష్ హెయిర్ లైన్స్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా ప్రారంభమయ్యాయి.