ఐపీఎల్ ముగిసి రెండు రోజులు కూడా కాకముందే టీ20 ప్రపంచకప్ హంగామా మొదలైపోయింది. నేటి నుంచి క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఒమన్, పపువా న్యూ గినియా తలపడగా.. పది వికెట్ల తేడాతో ఒమన్ విజయం సాధించి సూపర్ 12 వైపు అడుగులు వేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పవువా న్యూ గినియా స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే ఓపెనర్లు టోని యూరా(0), లెగా సియాకా(0)ల వికెట్లను కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అస్సద్ వాలా(56: 43 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), చార్లెస్ అమిని(37: 26 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు.
అయితే మూడో వికెట్ పడగానే.. మిగతా వికెట్లన్నీ పేకమేడలా కూలిపోయాయి. దీంతో 20 ఓవర్లలో పపువా న్యూ గినియా తొమ్మిది వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేసింది. ఒమన్ బౌలర్లలో జీషన్ మక్సూద్ నాలుగు వికెట్లు తీయగా.. కలీముల్లా, బిలాల్ ఖాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అకీబ్ ఇలియాస్ (50 నాటౌట్: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), జతీందర్ సింగ్ (73 నాటౌల్: 42 బంతుల్లో, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి ఆడారు. దీంతో 13.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఒమన్ విజయం సాధించింది.
నాలుగు వికెట్లు తీసి పపువా న్యూ గినియాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఒమన్ బౌలర్ జీషన్ మక్సూద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నేటి సాయంత్రం మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ తలపడనున్నాయి.
Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?
Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్ గంభీర్
Also Read: ఐపీఎల్ ఫైనల్ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా