News
News
వీడియోలు ఆటలు
X

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

క్వింటన్ డికాక్ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు.

FOLLOW US: 
Share:

Quinton de Kock Record: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాదించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టీ20 చరిత్రలోనే అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ముందు 20 ఓవర్లలో 259 పరుగుల విజయ లక్ష్యం ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి విజయం సాధించింది.

దక్షిణాఫ్రికా తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ అద్భుత సెంచరీ సాధించాడు. క్వింటన్ డి కాక్ 44 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.

ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్
అయితే ఈ సెంచరీతో క్వింటన్ డి కాక్ తన పేరిట ఓ పెద్ద రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వాస్తవానికి అంతర్జాతీయ T20 కాకుండా, క్వింటన్ డి కాక్ వన్డే, టెస్టు, అండర్-19, అండర్-19 టెస్ట్, అండర్-19 వన్డే, అండర్-19 టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. క్రికెట్ చరిత్రలో క్వింటన్ డి కాక్ మినహా మరే ఆటగాడు ఈ ఘనత సాధించలేకపోయాడు.

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. టీ20ల చరిత్రలోనే అత్యధిక రన్ ఛేజ్ చేసి రికార్డు సృష్టించింది. 259 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని మరో ఏడు బంతులు ఉండగానే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల సాధించింది. వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ ఛార్ల్స్ (118: 46 బంతుల్లో, 10 ఫోర్లు, 11 సిక్సర్లు) శతక్కొట్టాడు.

దీంతో ఇక సౌతాఫ్రికా పనైపోయిందిలే అనుకున్నారంతా. కానీ ఓపెనర్లు డి కాక్ (100: 44 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు), హెండ్రిక్స్ (68: 28 బంతుల్లో, 11 ఫోర్లు, రెండు సిక్సర్లు) వీర లెవెల్ లో ఉతికేశారు. పవర్ ప్లేలోనే స్కోరును వంద దాటించేశారు. డి కాక్ అయితే తన మొట్టమొదటి టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ కూడా బాదేశాడు. హెండ్రిక్స్, కెప్టెన్ మార్ క్రమ్ (38 నాటౌట్: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా అదరగొట్టటంతో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఏడు బంతులు ఉండగానే సౌతాఫ్రికా గెలిచేసింది. చరిత్ర సృష్టించింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసేసింది.

దక్షిణాఫ్రికా తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీ చేశాడు. క్వింటన్ డికాక్ కేవలం 44 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. ఇది కాకుండా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ కేవలం 28 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

అదే సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 21 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. రిలే రౌసో నాలుగు బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 7 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Published at : 27 Mar 2023 09:36 PM (IST) Tags: Quinton De Kock WI vs SA Cricket Record

సంబంధిత కథనాలు

IND VS AUS: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాకు కష్టాలు - 30 పరుగులకే ఓపెనర్లు అవుట్!

IND VS AUS: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియాకు కష్టాలు - 30 పరుగులకే ఓపెనర్లు అవుట్!

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!

IND VS AUS: 469కు ఆస్ట్రేలియా ఆలౌట్ - నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్!

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం