అన్వేషించండి

Lionel Messi: ఫిఫా బెస్ట్‌ ప్లేయర్‌ మెస్సీనే, మూడోసారి ప్రతిష్ఠాత్మక అవార్డు

Lionel Messi: మరో ప్రతిష్ఠాత్మక అవార్డు అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సి సొంతం. నార్వే స్ట్రైకర్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ను వెనక్కి నెట్టి ఫిఫా బెస్ట్ మెన్స్‌ ప్లేయర్‌ అవార్డు.

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సి(Lionel Messi) మరో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. నార్వే స్ట్రైకర్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌(Erling Haaland)ను వెనక్కి నెట్టి.... ఫిఫా బెస్ట్ మెన్స్‌ ప్లేయర్‌ (The Best FIFA Men's Player award 2023) అవార్డును సొంతం చేసుకున్నాడు. మెస్సీ ఈ అవార్డును గెలుచుకోవడం గత నాలుగేళ్లలో మూడోసారి. జాతీయ కోచ్‌లు, కెప్టెన్లు, పాత్రికేయులు, అభిమానులు ఆన్‌లైన్‌లో వేసిన ఓట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేశారు. మెస్సీ, హాలాండ్‌లు ఇద్దరూ 48 పాయింట్లతో సమంగా నిలిచారు. అప్పుడు జాతీయ జట్ల కెప్టెన్లు ఎవరికి ఎక్కువ ఓటు వేశారన్నది చూశారు. స్పెయిన్‌ స్ట్రైకర్‌ అయితనా బొన్మాటి ఫిఫా ఉత్తమ మహిళా ప్లేయర్‌ అవార్డును చేజిక్కించుకుంది. లండన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమానికి మెస్సి, హాలాండ్‌లు ఇద్దరూ హాజరు కాలేదు.

2023లో అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కూడా...
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ 2023లో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. టైమ్‌ మ్యాగజైన్‌ 2023 సంవత్సరానికి ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యాడు. మెస్సీ ఈ ఏడాది జులైలో మియామి క్లబ్‌లో చేరాడు. మొత్తం 14 గేమ్స్‌ ఆడి 11 గోల్స్‌ కొట్టి జట్టును తొలిసారి లీగ్‌ విజేతగా నిలిపాడు. మెస్సీ వచ్చాక టోర్నీ వీక్షకుల సంఖ్య పెరిగిందని టైమ్‌ ఈ సందర్భంగా పేర్కొంది. అతడు ఇంటర్‌ మియామి జట్టుకు సంతకం చేసి అమెరికాను ఏకంగా సాకర్‌ దేశంగా మార్చేశాడంది. మెస్సీ రాకతో ఎంఎల్‌ఎస్‌ టోర్నీ వీక్షకుల సంఖ్య తో పాటూ టికెట్‌ ధరలు, విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది. ఈ అవార్డ్ తో మెస్సీ టైమ్‌ నుంచి గతంలో ఈ అవార్డు అందుకొన్న మైకెల్‌ ఫెల్ప్స్‌ (స్విమ్మింగ్‌), సిమోన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌) వంటి వారి సరసన చేరాడు. ఇంతకుముందు పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ, ఆ కాంట్రాక్టు ముగియగానే బార్సిలోనా క్లబ్‌లో తిరిగి చేరాలని భావించాడు. కానీ, అతడి ప్రణాళికలు ఫలించకపోవడంతో దీంతో మియామి లేదా సౌదీ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకొన్నాడు. ఈ నేపథ్యంలో 20 మిలియన్‌ డాలర్లకు మియామి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అంతే కాదు రిటైర్మెంట్‌ తర్వాత ఈ క్లబ్‌ యాజమాన్య వాటాలో కొంత భాగం అతడికి కేటాయించేలా ఒప్పందం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి.

అది మెస్సీ క్రేజ్‌ అంటే
మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా 2022లో ఖ‌తార్‌లో జ‌రిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో ఫ్రాన్స్ ఓడించి విశ్వ విజేత‌గా నిలిచింది. ఈ మ్యాచులో మెస్సీ రెండు గోల్స్ చేసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్‌లో ఆన్‌లైన్‌ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 64 కోట్ల 86 లక్షల రూపాయలకు ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఎవ్వరూ వీటిని వేలంలో గెలుచుకున్నారు అన్న సంగ‌తిని వేలం నిర్వాహ‌కులు బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేదు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్న‌పిల్ల‌ల చికిత్స కోసం విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు మాత్రం తెలిపారు.
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget