SRH Vs RR, IPL 2022 LIVE: SRH ఎక్కడ ఆపేసిందో అక్కడ్నుంచే మొదలెట్టింది! RR చేతిలో 61 రన్స్‌ తేడాతో ఓటమి

IPL 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడుతున్నాయి. మరి ఈ రెండింట్లో ఎవరిపై ఎవరిది పై చేయి?

ABP Desam Last Updated: 29 Mar 2022 11:12 PM
20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 149-7

SRH Vs RR, IPL 2022 LIVE Updates: రియాన్‌ 15 పరుగులు ఇచ్చాడు. మార్క్‌క్రమ్‌ (57)అజేయ హాఫ్‌ సెంచరీ చేశాడు. భువీ (3) అతడికి అండగా ఉన్నాడు. మొత్తంగా సన్‌రైజర్స్‌ 61 పరుగుల తేడాతో ఓడింది.

18 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 119-6

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ప్రసిద్ధ్‌ 14 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని మార్‌క్రమ్‌ (44) 6, 4గా మలిచాడు, సుందర్‌ (20) అతడికి తోడుగా ఉన్నాడు.

17 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 105-6

SRH Vs RR, IPL 2022 LIVE Updates: కౌల్టర్‌నైట్‌ చెత్త బౌలింగ్‌ చేశాడు. 24 పరుగులు చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (27) వరుసగా 6, 4, 4, 2, 4, 4తో అలరించాడు. మార్‌క్రమ్‌ (32) మరో ఎండ్‌లో ఉన్నాడు.

16 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 81-6

SRH Vs RR, IPL 2022 LIVE Updates: చాహల్‌ 4 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. వాషింగ్టన్‌ (3), మార్‌క్రమ్‌ (32) క్రీజులో ఉన్నారు.

14 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 72-5

SRH Vs RR, IPL 2022 LIVE Updates: కౌల్టర్‌నైల్‌ 17 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని షెఫర్డ్‌ (21) సిక్సర్లు బాదేశాడు. మార్‌క్రమ్‌ (29) మరో ఎండ్‌లో ఉన్నాడు.

13 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 55-5

SRH Vs RR, IPL 2022 LIVE Updates: చాహల్‌ 11 పరుగులు ఇచ్చాడు. మార్‌క్రమ్‌ (4) ఒక బౌండరీ కొట్టాడు. అతడిచ్చిన క్యాచ్‌ను కౌల్టర్‌నైల్‌ వదిలేశాడు. షెఫర్డ్‌ (7) అతడికి తోడుగా ఉన్నాడు.

12 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 44-5

SRH Vs RR, IPL 2022 LIVE Updates: అశ్విన్‌ 5 వికెట్లు తీశాడు. మార్‌క్రమ్‌ (19), రొమారియో షెఫర్డ్‌ (4) నిలకడగా ఆడుతున్నారు.

11 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 39-5

SRH Vs RR, IPL 2022 LIVE Updates: యూజీ వికెట్‌ తీసి 3 పరుగులు ఇచ్చాడు. రెండో బంతికి సమద్‌ (4) ఔటయ్యాడు. మార్‌క్రమ్‌ (17), రొమారియో షెఫర్డ్‌ (1) సింగిల్స్‌ తీస్తున్నారు.

10 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 36-4

SRH Vs RR, IPL 2022 LIVE Updates: అశ్విన్‌ 4 పరుగులు ఇచ్చాడు. మార్‌క్రమ్‌ (15), సమద్‌ (4) సింగిల్స్‌ తీస్తున్నారు.

9 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 32-4

SRH Vs RR, IPL 2022 LIVE Updates: చాహల్‌ 4 పరుగులు ఇచ్చాడు. అబ్డుల్‌ సమద్‌ (2), మార్‌క్రమ్‌ (13) నిలకడగా ఆడుతున్నారు.

యూజీకి రాగానే వికెట్‌

SRH Vs RR, IPL 2022 LIVE Updates: యుజ్వేంద్ర చాహల్‌ రాగానే వికెట్‌ అందించాడు. 8.2వ బంతికి అభిషేక్ శర్మ (9)ను ఔట్‌ చేశాడు. హెట్‌మైయిర్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ 29/4తో ఉంది.

8 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 28-3

SRH Vs RR, IPL 2022 LIVE Updates: అశ్విన్‌ వచ్చాడు. 7 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతికి అభిషేక్‌ (9) బౌండరీ సాధించాడు. మార్‌క్రమ్‌ (11) నిలకడగా ఆడుతున్నాడు.

7 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 21-3

SRH Vs RR, IPL 2022 LIVE Updates: కౌల్టర్‌నైల్‌ వచ్చాడు. 7 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని మార్‌క్రమ్‌ (9) బౌండరీ కొట్టాడు. అభిషేక్‌ (4) నిలకడగా ఆడుతున్నాడు.

6 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 14-3

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ప్రసిద్ధ్‌ వణికిస్తున్నాడు. ఈ ఓవర్లో ఒకే పరుగు ఇచ్చాడు. మార్‌క్రమ్‌ (4), అభిషేక్‌ (3) ఆచితూచి ఆడుతున్నారు.

5 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 13-3

SRH Vs RR, IPL 2022 LIVE Updates: బౌల్ట్‌ చుక్కలు చూపించాడు. 6 పరుగులే ఇచ్చి SRH కోట్లు పెట్టి కొనుకున్న నికోలస్‌ పూరన్‌ (0)ను ఎల్బీ చేశాడు. అభిషేక్‌ (2), మార్‌క్రమ్‌ (4) క్రీజులో ఉన్నారు.

4 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 7-2

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ప్రసిద్ధ్‌ పరుగులేమీ ఇవ్వకుండా వికెట్‌ తీశాడు. నికోలస్‌ పూరన్‌ (0) క్రీజులోకి వచ్చాడు. అభిషేక్‌ (1) మరో ఎండ్‌లో ఉన్నాడు.

ప్రసిద్ధ్‌కు మరో వికెట్‌

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ప్రసిద్ధ్‌ వేసిన 3.1వ బంతికి రాహుల్‌ త్రిపాఠి (0) ఔటయ్యాడు. సంజు శామ్సన్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

3 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 7-1

SRH Vs RR, IPL 2022 LIVE Updates: బౌల్ట్‌ 4 పరుగులు ఇచ్చాడు. బంతిని సూపర్‌గా స్వింగ్‌ చేస్తున్నాడు. అభిషేక్‌ (1), త్రిపాఠి (0) క్రీజులో ఉన్నారు.

2 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 3-1

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ప్రసిద్ధ్‌ 1 పరుగు ఇచ్చి కేన్‌ను ఔట్‌ చేశాడు. రాహుల్‌ త్రిపాఠి (0) క్రీజులోకి వచ్చాడు. అభిషేక్‌ (1) మరో ఎండ్‌లో ఉన్నాడు.

షాక్‌..! సంజు, పడిక్కల్‌ ఎఫర్ట్‌తో కేన్‌ ఔట్‌

SRH Vs RR, IPL 2022 LIVE Updates: సన్‌రైజర్స్‌కు షాక్‌! ప్రసిద్ధ్‌ వేసిన 1.4వ బంతికి కేన్‌ విలియమ్సన్‌ (2) ఔటయ్యాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి సంజు శాంసన్‌ గ్లోవ్స్‌లోంచి ఎగిరినప్పుడు ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న దేవదత్‌ పడిక్కల్‌ డైవ్‌ చేసి దానిని అందుకున్నాడు.

1 ఓవరుకు సన్‌రైజర్స్‌ 2-0

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌ ఆరంభించాడు. 2 పరుగులే ఇచ్చాడు. కేన్‌ విలియమ్సన్‌ (2), అభిషేక్‌ శర్మ (0) ఓపెనింగ్‌కు దిగారు.

అదీ సంగతి!

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ అత్యధిక ఛేదన 199.  హైదరాబాద్‌లోనే 2019లో చేశారు.

20 ఓవర్లకు రాజస్థాన్‌ 210-6

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ఆఖరి ఓవర్‌ను నట్టూ బాగా వేశాడు. 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో బంతికి హెట్‌మైయిర్‌ (32), ఆఖరి బంతికి రియాన్‌ (12)ను ఔట్‌ చేశాడు. కౌల్టర్‌ నైల్‌ (1) అజేయంగా నిలిచాడు.

19 ఓవర్లకు రాజస్థాన్‌ 203-4

SRH Vs RR, IPL 2022 LIVE Updates: భువనేశ్వర్‌ 15 పరుగులు ఇచ్చాడు. హెట్‌మైయిర్‌ (28) రెండు సిక్సర్లు కొట్టాడు. రియాన్‌ పరాగ్‌ (11) నిలకడగా ఆడుతున్నాడు.

18 ఓవర్లకు రాజస్థాన్‌ 188-4

SRH Vs RR, IPL 2022 LIVE Updates: నటరాజన్‌ 18 పరుగులు ఇచ్చాడు. పరాగ్‌ (10) ఒక ఫోర్‌ కొడితే హెట్‌మైయిర్‌ (15) ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ బాదేశాడు.

17 ఓవర్లకు రాజస్థాన్‌ 170-4

SRH Vs RR, IPL 2022 LIVE Updates: భువీ 7 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. తొలి బంతికి సంజు శాంసన్‌ను ఔట్‌ చేశాడు. రియాన్ పరాగ్‌ (5), హెట్‌మైయిర్‌ (3) ఆచితూచి ఆడుతున్నారు.

16 ఓవర్లకు రాజస్థాన్‌ 163-3

SRH Vs RR, IPL 2022 LIVE Updates: వాషింగ్టన్‌ 15 పరుగులు ఇచ్చాడు. సంజు శాంసన్‌ (55) వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. తన వందో మ్యాచులో 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. హెట్‌మైయిర్‌ (2) మరో ఎండ్‌లో ఉన్నాడు.

15 ఓవర్లకు రాజస్థాన్‌ 148-3

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ఉమ్రాన్‌ మాలిక్‌ మరో వికెట్‌ తీసి 10 పరుగులు ఇచ్చాడు. ఒక బౌండరీ బాదేసిన పడిక్కల్‌ (41)ని ఆఖరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. సంజు శాంసన్‌ (42) హాఫ్‌ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

14 ఓవర్లకు రాజస్థాన్‌ 138-2

SRH Vs RR, IPL 2022 LIVE Updates: షెఫర్డ్‌ 17 పరుగులు ఇచ్చాడు. పడిక్కల్‌ (36) రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ కొట్టాడు. సంజు (37) మరో ఎండ్‌లో ఉన్నాడు.

13 ఓవర్లకు రాజస్థాన్‌ 121-2

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ఉమ్రాన్‌ 7 పరుగులు ఇచ్చాడు. పడిక్కల్‌ (19), సంజు (37) నిలకడగా ఆడుతున్నారు.

12 ఓవర్లకు రాజస్థాన్‌ 114-2

SRH Vs RR, IPL 2022 LIVE Updates: నటరాజన్‌ 13 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో పడిక్కల్‌ (16) ఒక సిక్స్‌, ఒక బౌండరీ కొట్టాడు. సంజు (37) మరో ఎండ్‌లో ఉన్నాడు.

11 ఓవర్లకు రాజస్థాన్‌ 101-2

SRH Vs RR, IPL 2022 LIVE Updates: వాషింగ్టన్‌ 14 పరుగులు ఇచ్చాడు. సంజు శాంసన్‌ (36) వీర విహారం చేస్తున్నాడు. తొలి బంతిని సిక్సర్‌, నాలుగో బంతిని బౌండరీ కొట్టాడు. పడిక్కల్‌ (4) అతడికి తోడుగా ఉన్నాడు.

10 ఓవర్లకు రాజస్థాన్‌ 87-2

SRH Vs RR, IPL 2022 LIVE Updates: షెఫర్డ్‌ 9 పరుగులు ఇచ్చాడు. సంజు (23) రెండో బంతికి సిక్సర్‌గా మలిచాడు. పడిక్కల్‌ (3) నిలకడగా ఆడుతున్నాడు.

9 ఓవర్లకు రాజస్థాన్‌ 78-2

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ఉమ్రాన్‌ మాలిక్‌ సన్‌రైజర్స్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. తొలి బంతికి జోష్‌ బట్లర్ (35)ను ఔట్‌ చేశాడు. దేవదత్‌ పడిక్కల్‌ (2) క్రీజులోకి వచ్చాడు. సంజు (16) నిలకడగా ఆడుతున్నాడు.

8 ఓవర్లకు రాజస్థాన్‌ 75-1

SRH Vs RR, IPL 2022 LIVE Updates: అభిషేక్‌ శర్మ 15 పరుగులు ఇచ్చాడు. సంజు శాంసన్‌ (15) ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ కొట్టాడు. బట్లర్‌ (౩5) మరో ఎండ్‌లో ఉన్నాడు.

7 ఓవర్లకు రాజస్థాన్‌ 60-1

SRH Vs RR, IPL 2022 LIVE Updates: షెఫర్డ్‌ బౌలింగ్‌కు వచ్చాడు. 2 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. తొలి బంతికి జైశ్వాల్ (20) ఔటయ్యాడు. సంజు (1) క్రీజులోకి వచ్చాడు. బట్లర్‌ (34) విధ్వంసకరంగా ఆడుతున్నాడు.

6 ఓవర్లకు రాజస్థాన్‌ 58-0

SRH Vs RR, IPL 2022 LIVE Updates: నటరాజన్‌ 6 పరుగులు ఇచ్చాడు. మొదటి బంతికి జైశ్వాల్‌ (20) బౌండరీ కొట్టాడు. బట్లర్‌ (33) మరో ఎండ్‌లో ఉన్నాడు.

5 ఓవర్లకు రాజస్థాన్‌ 52-0

SRH Vs RR, IPL 2022 LIVE Updates: వాషింగ్టన్‌ సుందర్‌ వచ్చాడు. 18 పరుగులు ఇచ్చాడు. బట్లర్‌ (33), జైశ్వాల్‌ (15) చెరో సిక్సర్‌ కొట్టారు.

4 ఓవర్లకు రాజస్థాన్‌ 34-0

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ఉమ్రాన్ మాలిక్‌కు జోస్‌ బట్లర్‌ (25) చుక్కలు చూపించాడు. వరుసగా 4, 6, 4 బాదేశాడు. ఆఖరి బంతిని మళ్లీ సిక్సర్‌గా మలిచాడు. ఈ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. జైశ్వాల్‌ (6) మరో ఎండ్‌లో ఉన్నాడు.

3 ఓవర్లకు రాజస్థాన్‌ 13-0

SRH Vs RR, IPL 2022 LIVE Updates: భువీ ఈ సారి 7 పరుగులు ఇచ్చాడు. బంతిని చక్కగా స్వింగ్‌ చేస్తున్నాడు. మూడో బంతిని జైశ్వాల్‌ (6) బౌండరీ కొట్టాడు. బట్లర్ (5) నిలకడగా ఆడుతున్నాడు.

2 ఓవర్లకు రాజస్థాన్‌ 6-0

SRH Vs RR, IPL 2022 LIVE Updates: రొమారియో షెఫర్డ్‌ మరో ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేశాడు. 5 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని జోష్‌ బట్లర్‌ (4) బౌండరీకి పంపించాడు. జైశ్వాల్‌ (1) మరో ఎండ్‌లో ఉన్నాడు. 

భువీకి చిక్కిన జోస్‌ బట్లర్‌.. కానీ!

SRH Vs RR, IPL 2022 LIVE Updates: గ్రీన్‌ టర్ఫ్‌పై భువనేశ్వర్‌ కుమార్‌ చుక్కలు చూపించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేశాడు. దాంతో జోస్‌ బట్లర్‌ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఐదో బంతికి అతడిని భువీ ఔట్‌ చేశాడు. కానీ నోబాల్‌ కావడంతో బతికి పోయాడు. యశస్వీ జైశ్వాస్‌ మరో ఎండ్‌లో ఉన్నాడు. 1 ఓవర్‌కు రాజస్థాన్‌ స్కోరు 1-0


Background

IPL 2022, SRH vs RR preview: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు (IPL 2022) ఐదో మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడుతున్నాయి. మహారాష్ట్రలోని పుణె ఇందుకు వేదిక. గతేడాది ఘోర ఓటములతో హైదరాబాద్‌ అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు ఎంటర్‌టైన్‌ చేయడంలో తిరుగులేని రాజస్థాన్‌ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. మరి ఈ రెండింట్లో ఎవరిపై ఎవరిది పై చేయి? ఎవరి బ్యాటింగ్‌ లైనప్‌ ఎలా ఉంది? ఎవరి బౌలింగ్‌ లైన్‌ మెరుగ్గా ఉంది?


RR, SRH సమవుజ్జీలే


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లో(SRH vs RR) ఒకరు ఎక్కువా కాదు! ఇంకొకరు తక్కువా కాదు! రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు ఐపీఎల్‌లో తలపడితే రాజస్థాన్‌ 7 సార్లు గెలిచింది. సన్‌రైజర్స్‌ 8 సార్లు విజయం సాధించింది. చివరిగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో రాజస్థాన్ మూడు గెలిస్తే హైదరాబాద్‌ రెండే గెలిచింది. గత సీజన్లో చెరోటి గెలిచారు.


Sanju Samson, Jos Buttler దబిడి దిబిడే


* 2020 నుంచి ఐపీఎల్‌లో కేవలం ఐదుగురు బ్యాటర్లు మాత్రమే 40 ప్లస్‌ సగటు, 140 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. అందులో ఇద్దరు రాజస్థాన్‌లోనే ఉన్నారు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ 54. 50 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టగా జోస్‌ బట్లర్‌ 43 సగటు, 159 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టాడు.


* ఐపీఎల్‌ పవర్‌ప్లేలో అత్యంత విజయవంతమైన సీమర్‌, స్పిన్నర్‌ రాజస్థాన్‌లోనే ఉన్నారు. ఐపీఎల్‌ 2020 నుంచి ట్రెంట్‌ బౌల్ట్‌ (21 వికెట్లు), అశ్విన్‌ (8 వికెట్లు) మించి పవర్‌ప్లేలో ఇంకెవ్వరూ రాణించలేదు.


* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దాదాపుగా 2021 బౌలింగ్‌ లైనప్‌నే తీసుకుంది. వీరిపై దేవదత్‌ పడిక్కల్‌కు మెరుగైన రికార్డులేదు. 94.21 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు.


RR, SRH Probable XI


రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, దేవదత్‌ పడిక్కల్‌, సంజు శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, జేమ్స్‌ నీషమ్‌ / నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, నికోలస్‌ పూరన్‌, అయిడెన్‌ మార్క్‌క్రమ్, అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో జెన్‌సన్‌ / రొమారియో షెఫర్డ్‌, భువనేశ్వర్ కుమార్‌, టి.నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.