Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు

Andhra Pradesh News | తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని ఆరోపించిన లక్ష్మీ అనే మహిళను జైపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Continues below advertisement

Jana Sena leader Kiran Royal | తిరుపతి: జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసిన లక్ష్మి.. సోమవారం ఉదయం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రీవెన్స్ లో కిరణ్ రాయల్ వ్యవహారంపై ఆమె ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తనకు రావాల్సిన సొమ్ము ఇప్పించాలని ఎస్పీని కోరారు. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తన బాధలు చెప్పుకుంది. ఇంతలో అకస్మాత్తుగా రాజస్థాన్ నుంచి వచ్చిన పోలీసులు ప్రెస్ క్లబ్ సమీపంలో లక్ష్మిని అరెస్టు చేసి తీసుకెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. జైపూర్‌లో లక్ష్మీపై పలు చీటింగ్ కేసులున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లోనూ లక్ష్మిపై కేసులు నమోదు కాగా, పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

Continues below advertisement

లక్ష్మీ ఆరోపణలు ఇవే..

జనసేన నేత కిరణ్ రాయల్ తన నుంచి కోట్ల రూపాయాలు తీసుకుని మోసం చేశాడని లక్ష్మి ఎస్పీని కలిసి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ‘కిరణ్ రాయల్ చేసిన అన్యాయానికి సంబంధించి పూర్తి ఆధారాలు అందిస్తాను. డబ్బులు ఉన్నంత వరకు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు నా పిల్లల భవిష్యత్ కోసం పోరాటం చేస్తా. కిలాడి లేడీ అంటూ అని కిరణ్ రాయల్ నాపై అసత్యప్రచారం చేస్తున్నాడు. అతడి మాటలు విని మోసపోయా. లక్ష రూపాయల చెక్ బౌన్స్ కేసు ఉంది. గొడవలు, ఆర్థిక సమస్యలతో నా కుటుంబం నన్ను దూరం పెట్టింది. నా బిడ్డకు సర్జరీకి డబ్బులడిగితే, నా నుంచి నుంచి  ఖాళీ చెక్ తీసుకున్నాడు. నన్ను ఎంతో అవమానించాడు. తన వెనక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారంటూ నన్ను భయపెట్టాడు. ఏపీ ఎన్నికల తరువాత మొత్తం నగదు తిరిగి ఇచ్చేస్తా అంటే నమ్మి మోసపోయాను. 

 అమ్మాయిలను మోసం చేయమని కిరణ్ రాయల్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారా? పార్టీకి దూరంగా ఉండాలని జనసేన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. 2013 నుంచి సంబంధాలు ఉన్నాయని 2015 తో ముగిశాయని అసత్య ప్రచారం చేశాడు. మానస అనే అమ్మాయిని మోసం చేశాడు. తరువాత వేరొక అమ్మాయితో చనువుగా ఉండి మోసం చేశాడు. ఆ అమ్మాయి జీవితం కదా అని, ఇబ్బంది పెట్టవద్దనుకుని ఇన్నాళ్లు బయట పెట్టలేదు. నాకు ఎవరూ మద్దతు లేరు. నాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ అందర్నీ కోరుతున్నాను. అలాంటి నీచుడ్ని వదిలొద్దు. 

నాకు డబ్బులు ఇస్తే లక్ష్మిని వదులుకుంటానని వేరొక మహిళతో కిరణ్ రాయల్ చెప్పాడు. ఆ మహిళ ఆడియో విడుదల చేస్తున్న. వాళ్లింట్లోనే ఆ అమ్మాయిని కొట్టాడు. ఇన్ని సాక్ష్యాలు చూసిన తర్వాత కొంత మంది అతడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. అతని అవసరం తీరిపోతే వదిలిపోతాడు. అతనికి సంబంధించి అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నాకు ఇవ్వాల్సి రూ.1.2 కోట్లు ఇప్పించండి. తనకు డబ్బులు ఇవ్వాల్సింది లేదని కిరణ్ రాయల్ కాణిపాకంకు వచ్చి ప్రమాణం చేస్తే.. నేను ఇప్పుడే వదులు కుంటా. చంపుతానని బెదిరిస్తే ఇన్ని రోజులు భయపడి మీడియా ముందుకు రాలేదు. కానీ అత్తగారి ఆస్తులమ్మి కిరణ్ రాయల్‌కు ఇచ్చి మోసపోయా. 

25 సవర్ల బంగారం తీసుకున్నాడు. నాకు రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చాడు. పదేళ్లుగా అతడికి సెల్ ఫోన్లు నేనే కొనిచ్చాను. అతడి ప్రతి పైసా నాదే. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగి ఆత్మహత్యాయత్నం చేశాను. జనసేన నేతలతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు. జనసేన నుంచి వీర మహిళలు ఓట్ ఫర్ కిరణ్ అని ప్రచారం చేయడం బాధాకరం. ఒంటరి మహిళకు న్యాయం చేయండి. 2023లో నాకు ఎందుకు చెక్స్ ఇచ్చాడు. అది బౌన్స్ అయి కష్టాలు పడ్డాను అని’ లక్ష్మీ చెప్పుకొచ్చారు.

Continues below advertisement