Longest traffic jam in the world  Sea of vehicles drown 300 km stretch to Maha Kumbh: ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ కారణంగా ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వరకూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కనీసం మూడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.   నెటిజన్లు దీనిని "ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్" ​​అని అభివర్ణిస్తున్నారు. 



ఈ ట్రాఫిక్ జాం.. ఉత్తప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వరకూ విస్తరించింది. ఒక కిలోమీటర్ కదలడానికి గంటలతరబడి పడుతోంది.  ప్రయాగరాజ్ నుంచి కాట్ని ,మైహార్ వంటి మధ్యప్రదేశ్ నగరాల వరకు 250-300 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా కార్ల బారులే కనిపిస్తున్నాయి.  చాలా సేపు ట్రాఫిక్ జామ్ కావడంతో.. అనేక మంది భక్తులు వెనక్కి వెళ్లాలనుకుంటున్నామని పోలీసులుక చెబుతున్నారు.  పోలీసులు కూడా  ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్ని అనే ప్రాంతం నుంచి భక్తుల్ని వెనక్కి పంపుతున్నారు.   



వందల కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో ఎక్కడిక్కకడ పార్కింగ్ స్థలాలుగా మార్చేసి సేదదీరుతున్నారు. సోషల్ మీడియాలో ట్రాఫిక్ జామ్ దృశ్యాలు వైరల్ గా మారుతున్నాయి.  కట్ని, జబల్‌పూర్, మైహార్,  రేవా జిల్లాల్లోని రోడ్లపై వేలాది కార్లు , ట్రక్కుల వీడియోలు  వైరల్ అవుతున్నాయి. మహా కుంభమేళాకు వచ్చే వారు ఓ సారి ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకుని బయలుదేరాలని సలహాలు ఇస్తున్నారు. 



సాధారణంగా విదేశాల్లో ఇలాంటి ట్రాఫిక్ జాములు అవుతూ ఉంటాయి. కానీ మన దేశంలో నాలుగైదు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయినా గంటల్లో క్లియర్ అవుతుంది. కానీ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ మాత్రం రోజుల తరబడి కొనసాగే అవకాశం ఉంది.