Vishwaksen: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా'పై స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్

Vishwaksen Apology: 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ వ్యాఖ్యలు పెనుదుమారం రేపగా.. 'బాయ్ కాట్ లైలా' ట్రెండ్ అయ్యింది. దీనిపై విశ్వక్, నిర్మాత వివరణ ఇచ్చారు. విశ్వక్ సారీ చెప్పారు.

Continues below advertisement

Vishwak Sen Said Sorry About Political Controversy In Laila Pre Release Event: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన 'లైలా' (Laila) సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే, ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. పరోక్షంగా తమ పార్టీని అవమానించారంటూ వైసీపీ ఫ్యాన్స్ ఫైరయ్యారు. సోషల్ మీడియా వేదికగా 'బాయ్ కాట్ లైలా'ను ట్రెండ్ చేశారు. ఈ అంశంపై తాజాగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హీరో విశ్వక్, నిర్మాత సాహు గారపాటి (Sahu Garapati) వివరణ ఇచ్చారు. పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Continues below advertisement

'అది చూసి షాక్ అయ్యాం'

'సోషల్ మీడియాలో బాయ్ కాట్ 'లైలా' ట్రెండ్ కావడం చూసి షాక్ అయ్యాం. అది మా నోటీస్‌లో జరగలేదు. సినిమాను అందరూ సినిమాగా చూడండి. గెస్టులుగా వచ్చిన వాళ్లు ఏం మాట్లాడతారో మాకు తెలీదు. ఆ వ్యక్తి మాట్లాడే సమయంలో మేము అక్కడ లేం. చిరంజీవిని లోపలికి తీసుకొచ్చేందుకు వెళ్లాం. అది మాకు తెలియకుండా జరిగింది. ఏది ఏమైనా సినిమా ఒకరిద్దరిది కాదు. వేల మంది కష్టపడి పనిచేస్తేనే అవుట్ పుట్ వస్తుంది. ఇది వేరే కోణంలో ప్రచారం అవడం వల్ల సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ఇబ్బందే. ఆ వ్యాఖ్యలపై మా తరఫున క్షమాపణ చెబుతున్నాం.' అని నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు.

Also Read: జాబిలమ్మా.. నీకు అంత కోపమెందుకు? - జాలీగా రండి.. జాలీగా వెళ్లండి, హుషారుగా ధనుష్ కొత్త మూవీ ట్రైలర్ చూసేయండి!

సారీ చెప్పిన విశ్వక్ సేన్

ఈ వివాదంపై స్పందించిన హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) క్షమాపణ చెప్పారు. 'ఆ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడుతారో మేం ఊహించలేం. పృథ్వీ మాట్లాడిన విషయం కూడా మాకు తెలీదు. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో వేల ట్వీట్స్ అంటే ఎలా సినిమా బ్రతకాలా లేదా ?. సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా.?. మేము చిరంజీవి గారిని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్లినప్పుడు అతను మాట్లాడాడు. అది మా కంట్రోల్‌లో జరుగలేదు. చాలా కష్టపడి సినిమా తీశాం. మా ఈవెంట్‌లో జరిగిన దానికి సారీ చెపుతున్నాను. సినిమాలో నటించారు కాబట్టి స్టేజీ మీదకు పిలిచి మాట్లాడమని చెప్పాం. మాది సినిమా ఈవెంట్ రాజకీయాలు మాట్లాడకూడదు. దయచేసి మా సినిమాను చంపేయకండి. నాకు రాజకీయాలు మాట్లాడేంత అనుభవం కూడా లేదు. ఆయన మాట్లాడేటప్పుడు నేను అక్కడ ఉన్నానని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాను. ఎవరో ఒకరు చేసిన తప్పునకు మా సినిమాను బలి చెయ్యొద్దు. నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను.' అని విశ్వక్ స్పష్టం చేశారు.

ఇదీ వివాదం

కాగా.. ఆదివారం జరిగిన 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 30 ఇయర్స్ పృథ్వీ (30 Years Prudhvi Raj) చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. 'మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయి.' అంటూ పేర్కొన్నారు. అయితే, పరోక్షంగా తమ పార్టీపై సెటైర్లు వేశారంటూ వైసీపీ ఫ్యాన్స్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బాయ్ కాట్ లైలా' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దీనిపైనే తాజాగా హీరో విశ్వక్, నిర్మాత సాహు వివరణ ఇచ్చారు.

Also Read: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

Continues below advertisement
Sponsored Links by Taboola