SaReGaMaPa Winner : ఎవరీ అభిజ్ఞ? సరిగమప 16 విన్నర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే... అమెరికా నుంచి ఇండియా వచ్చి!
SaReGaMaPa The Next Singing Icon Winner Telugu : 'సరిగమప సీజన్ 16 ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్' షో విన్నర్ గా నిలిచిన అభిజ్ఞ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

SaReGaMaPa : బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న 'సరిగమప సీజన్ -16' చివరి అంకం ముగిసింది. నాగచైతన్య సాయి, పల్లవి గెస్టులుగా ఈ మూవీ గ్రాండ్ ఫినాలే మరింత గ్రాండ్ గా జరిగింది. 'సరిగమప సీజన్ 16 ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్' షో గ్రాండ్ ఫినాలే ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారమైంది. శ్రీముఖి ఈ షోకి యాంకర్ గా వ్యవహరిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, పాటల రచయిత కాసర్ల శ్యామ్, గాయని ఎస్పీ శైలజ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం మూడు జెట్లు పోటీ పడగా... సింగర్స్ రమ్య బెహరా, రేవంత్, అనుదీప్ మెంటార్లుగా వ్యవహరించారు. అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తున్న కంటెస్టెంట్స్ సాత్విక్, మేఘన, వైష్ణవి, మోహన్, అభిజ్ఞా, మానసి ఫినాలేకు చేరుకోగా, అభిజ్ఞ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే అభిజ్ఞ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజెన్లు.
సరిగమప సీజన్ - 16 విన్నర్ అభిజ్ఞ ఎవరు?
తాజాగా అభిజ్ఞ 'సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ షో' మేకర్స్ రిలీజ్ చేసిన వీడియోలో తన జర్నీని పంచుకుంది. అభిజ్ఞ పూర్తి పేరు అభిజ్ఞ ఎనగంటి. ఆమెకు మొదటిసారి టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో ఒకరైన శ్రీకృష్ణ తో పాడే ఛాన్స్ రావడం, అలాగే ఆమె పాడిన 'స్నేహితుడా' సాంగ్ కు కోటి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం సంతోషంగా ఉందంటూ, అవన్నీ మరిచిపోలేని అనుభవాలు అని చెప్పుకొచ్చింది అభిజ్ఞ.
సరిగమప షోలోకి ఎంట్రీ ఎలా?
'సరిగమప సీజన్ -16' షో అవకాశం ఎలా వచ్చిందంటే... ఇన్ స్టాగ్రామ్ లో ఆడిషన్స్ జరుగుతున్నట్టు తెలుసుకుందట అభిజ్ఞ. పెద్దగా కాన్ఫిడెన్స్ లేకపోయినా ఓ సారి ట్రై చేద్దామని 'సరిగమప' ఆడిషన్స్ ఇచ్చింది. కానీ లక్ కూడా కలిసి వచ్చి ఆమెకు ఈ షోలో సెలెక్ట్ అయినట్టు కాల్ రావడంతో ఎగిరి గంతేసిందట. ఆ తరువాత జరిగిన జర్నీ మొత్తాన్ని బుల్లితెర ప్రేక్షకుల చూశారు. అలా వచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకుని, నేడు 'సరిగమప 16 విన్నర్ గా నిలిచి 'సరిగమప సీజన్ 16 ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్' టైటిల్ తో పాటు, 10 లక్షల ప్రైజ్ మనీని కూడా గెలుచుకుంది. అలాగే ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది అభిజ్ఞ.
Also Read: జీ తెలుగు సీరియల్స్... మళ్ళీ సేమ్ టైమింగ్స్‌లో... ప్రతి రోజూ ఏది ఏ టైంలో వస్తుందో తెలుసుకోండి