'జీ తెలుగు' (Zee Telugu TV)కు తెలుగు బుల్లితెర వీక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. తెలుగు టీవీ ఆడియన్స్ ఫేవరేట్ సీరియళ్లు ఆ ఛానల్‌లో చాలా ఉన్నాయి. ప్రతి సాయంత్రం ఆ సీరియల్స్ కోసం టీవీ ముందు కూర్చునే జనాలకు జనవరిలో షాక్ తగిలింది. క్రికెట్ లైవ్ టెలికాస్ట్ కోసం సీరియల్స్ టైమింగ్స్ ఛేంజ్ చేసింది 'జీ తెలుగు'. మళ్ళీ ఇప్పుడు సేమ్ టైమింగ్స్, టైమ్ స్లాట్స్‌లో సీరియల్స్ టెలికాస్ట్ చేయనుంది. 

'జీ తెలుగు'లో ఏ సీరియల్ ఏ టైంలో వస్తుంది?
Zee Telugu HD Serial Timings: జనవరి 10వ తేదీ... అంటే సోమవారం నుంచి 'జీ తెలుగు'లో సీరియల్ టైమింగ్స్ మళ్ళీ మారుతున్నాయి. ఎప్పటిలా సేమ్ టైమింగ్స్‌లో వస్తాయని జీ తెలుగు పేర్కొంది. ఏ టైంలో ఏ సీరియల్ వస్తుంది? అనే షెడ్యూల్ చూడండి.

నంబర్ సీరియల్ పేరు టెలికాస్ట్ టైమింగ్
1 చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయంత్రం 6 గంటలకు
2 మా అన్నయ్య సాయంత్రం 6:30 గంటలకు
3 నిండు నూరేళ్ల సావాసం రాత్రి 7 గంటలకు
4 మేఘ సందేశం  రాత్రి 7:30 గంటలకు
5 పడమటి సంధ్యారాగం  రాత్రి 8 గంటలకు
7 చామంతి (కొత్త సీరియల్)  రాత్రి 8:30 గంటలకు
8 జగద్ధాత్రి  రాత్రి 9 గంటలకు
9 అమ్మాయి గారు  రాత్రి 9:30 గంటలకు
10 ప్రేమ ఎంత మధురం  రాత్రి 10 గంటలకు

Also Read: టీఆర్పీ రేటింగుల్లో గుడిగంటలు గట్టిగా మోగాయ్... స్టార్‌మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 లిస్ట్ - ఏయే సీరియల్స్‌ ఉన్నాయో చూశారా?

ఫిబ్రవరి రెండో వారం వరకు ఏ టైంలో టెలికాస్ట్ చేశారంటే?
టైమింగ్స్ మారిన తర్వాత జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు సుమారు 30 రోజులు పాటు సీరియల్ ఏ ఏ టైమింగ్స్ లో టెలికాస్ట్ అయ్యాయో తెలుసా?

ప్రతి రోజు రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అవుతుంది 'ప్రేమ ఎంత మధురం'. దానిని ఉదయం 11:30 గంటలకు టెలికాస్ట్ చేశారు. అలాగే, రాత్రి 8 గంటలకు వచ్చే 'పడమటి సంధ్యారాగం' సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7:30 గంటలకు టెలికాస్ట్ అయ్యే ''మేఘ సందేశం'ను మధ్యాహ్నం మూడున్నర గంటలకు, అలాగే రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవుతున్న కొత్త సీరియల్ 'చామంతి'ని సాయంత్రం 4:30 గంటలకు, అలాగే 'జగద్ధాత్రి'ని సాయంత్రం ఐదు గంటలకు, 'అమ్మాయి గారు'ను సాయంత్రం ఐదున్నర గంటలకు టెలికాస్ట్ చేసింది. ఇప్పుడు యధావిధిగా ఆయా సీరియళ్లను ప్రసారం చేయడానికి రెడీ అయింది జీ తెలుగు.

Also Read: పల్లవి గౌడ డబుల్ ధమాకా... జీ తెలుగు సీరియల్ 'నిండు నూరేళ్ళ సావాసం'లో ట్విస్ట్ తెలిసిందా?