Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం

Chilkur Balaji Temple Chief Priest Rangarajan : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిలుకూరు బాలజీ టెంపుప ప్రధాన అర్చకుడికి ఫోన్ చేశారు. దాడి గురించి అడిగి తెలుసుకున్నారు.

Continues below advertisement

Chilkur Balaji Temple Chief Priest Rangarajan : చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. రంగరాజన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాలన్న ఎమ్మెల్యేతో రావాలని సూచించారు. 

Continues below advertisement

తెలంగాణలో కలకలం రేపిన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన రాజకీయ మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షంతోపాటు అనేక రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. ఈ వివాదం మరింత ముదిరిపోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నేరుగా రంగరాజన్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకన్నారు.  
ఫోన్‌లో చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి... ఇలాంటి దాడులు సహించేది లేదని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే దీనిపై పోలీసులు, సంబంధిత అధికారులతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. కేసు విచారణ వేగవంతం చేయాలని సూచించారు. 

ఫోన్‌లో రంగరాజన్‌కు పరామర్శించిన రేవంత్... విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. సమస్య ఏం ఉన్నా సరే లోకల్ ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి తన వద్దకు రావాలని సూచించారు. ఏ సాయం కావాలన్నా నేరుగా అడగొచ్చని కూడా తెలిపారు. 

నిన్నటి నుంచి నడుస్తున్న వివాదానికి ముఖ్యమంత్రి తనదైన స్టైల్‌లో ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నకు సమధానం చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఎలాంటి ఇబ్బంది పడొద్దని రంగరాజన్‌కు భరోసా ఇచ్చారు. 

Also Read: వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి- రంగరాజన్‌పై దాడిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

అసలేం జరిగింది?
రామరాజ్యం పేరుతో వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని శనివారం నాడు చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు వచ్చారు. తన అనుచరులతో వచ్చిన వీర రాఘవరెడ్డి ప్రధాన అర్చకుడు రంగరాజన్‌తో మాట్లారు. తాము ఏర్పాటు చేసుకున్న రామరాజ్యం పేరుతో ఉన్న గ్రూప్‌లోకి భక్తులను చేర్చేలా ప్రచారం చేయాలని ప్రతిపాదించారు. అంతకు ముందు డబ్బులు కూడా డిమాండ్ చేశారని ఆరోపణలు వినిపించాయి. వీళ్లు ప్రతిపాదించిన ప్రతిపాదనలకు రంగరాజన్ అంగీకరించలేదు. 

రామరాజ్యం గ్రూప్ ప్రతిపాదనలను రంగరాజన్‌ అంగీకరించకపోవడంతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఆయనపై దాడికి కూడా చేశారు. అనంతరం ఆ వీడియోలను రామరాజ్యం పేరుతో ఉన్న సోషల్ మీడియా గ్రూప్‌లో పెట్టారు. తర్వాత ఈ దాడి గురించి రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు వెలుగులోకి వచ్చింది. 

ఒక అర్చకుడిపై దాడి జరగడాన్ని ప్రతిపక్షాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించాయి. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా పడిపోయాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు కేటీఆర్. దేవుడి సేవ చేసుకునే వ్యక్తిపై దాడి చేసిన వారిని ఏ ముసుగులో ఉన్న కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Also Read: శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !

Continues below advertisement